మంత్రి ఈశ్వరప్ప రాజీనామా.. ఎన్నికల ముందు ఎదురుదెబ్బ..
Publish Date:Apr 15, 2022
Advertisement
మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటకలో, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక పచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప, వత్తిళ్లకు తలొగ్గి,మంత్రి పదవికి రాజీనామా చేశారు. నిజానికి, నిన్న మొన్నటి దాకా, హిజాబ్, హలాల్ చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయం, గత నలుగు రోజులుగా, బీజేపీ ప్రభుత్వం అవినీతి చుట్టూ తిరుగుతోంది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప అవినీతి భాగోతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కొద్దిరోజుల క్రితం మంత్రి ఈశ్వరప్ప బిల్లుల చెల్లింపుకు 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఉడిపీలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసు కేసు నమోదైంది. ప్రథమ సమాచార నివేదిక ప్రకారం మంత్రి ఒత్తిడి కారణంగా కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి,పంచాయత్ రాజ్ శాఖలో చేసిన రూ. 4 కోట్ల విలువైన పనులకు బిల్లును క్లియర్ చేయడానికి మంత్రి సహచరులు 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని పాటిల్ ఆరోపించారు. తన మరణానికి ఈశ్వరప్పే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్‌లో అదారంగా పోలీసుల ఆయన ఫై కేసు నమోదు చేశారు. దీంతో దుమారం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ, ఈశ్వరప్ప రాజేనామా చేయాలని, ఆయన మీద హత్యా నేరం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. పీసీసీ చీఫ్, డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్’ ను కలిసి వినతి పత్రం అందజేసింది. అయితే ఈశ్వరప్ప మాత్రం చివరి వరకు రాజీనామా చేసే సవాలే లేదంటువచ్చారు. సూసైడ్ నోట్’ బోగస్ అని కొట్టివేశారు. వాట్సాప్’లో సంతకలేకుండా వచ్చిన బోగస్ సూసైడ్ నోట్ ఆధారంగా, చేసే ఆరోపణలకు విలువలేదని అన్నారు.కానీ, ఆత్మహత్యచేసుకున్న కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్యక్రియల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించి ప్రాధమిక విచారణ పూర్తయ్యే వరకు, మంత్రి ఈశ్వరప్పపై ఎలాంటి చర్య తీసుకునేది లేదని స్పష్టం చేశారు. మరోవంక బీజీపే అధిష్టానం ఈశ్వరప్ప పై వేటు వేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. వేటు వేస్తే ఏమిటి? వేయకపొతే ఏమిటి? అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కాగా,ఈ మొత్తం వ్యవహారం, బీజీపీ సీనియర్ నాయుడు,మజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నడుస్తోందని, బీజేపీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. అదలా ఉంటే, కర్ణాటక ప్రభుత్వంలో ఒక్క పంచాయతీ రాజ్ శాఖలోనే, కాదు, అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని, కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్, అధ్యక్షుడు కెంపెన్న బాంబు పేల్చారు. బిల్లులు క్లియర్ చేసుకునేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు 15నుంచి 40 శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మరో వరం రోజుల్లో, బీజేపే ప్రభుత్వ అవినీతి చిత్త మొత్తం విప్పుతానని, అయన చెప్పుకొచ్చారు. అంతేకాదు,ఇందుకు సంబందించి తమ అసోసియేషన్ ప్రధాని కార్యాలయానికి కూడ ఫిర్యదు చేసిందని, అయినా అటు నుంచి సమాధానం లేదని ఆయన అన్నారు. అయితే కెంపెన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మె’కు మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని, అయినా సంతోష్ పాటిల్ ఆత్మహత్య బీజేపీకి కనువిప్పు కావాలని అన్నారు. అదలా ఉంటే, మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప, కావాలని మంత్రి ఈశ్వరప్పను బద్నాం చేసేందుకు, పార్టీలో తమ ప్రాబల్యం పెంచుకునేందుకు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్’ను బలిపశువుని చేశారని, మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఆరోపించారు. అయితే, చివరకు మాత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయక తప్పలేదు. అయితే ఈ ఎపిసోడ్ ప్రధానంగా బీజేపీలో అంతర్గతకుమ్ములాటలు , మరీ ముఖ్యంగా యడ్డీ ఫాక్టర్ ఎఫెక్ట్’కు అద్దం పట్టిందని, అదే విధంగా బీజేపీ అవినీతి భాగోతం బయటకు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/karnatka-minister-eshwarappa-resigns-39-134423.html





