ఇది కేవలం ట్రైలర్ మాత్రమే...అసలు సినిమా ముందుంది : కవిత

Publish Date:Feb 14, 2026

Advertisement

 

సోషల్ మీడియా‌లో తనపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనదైన శైలిలో స్పందించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ ప్రత్యర్థులకు ట్రోలర్స్‌కు కవిత గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ దాడులకు భయపడేది లేదని భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరిస్తామని కవిత స్ఫష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కవిత సంతోషం  వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ సంస్థ ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతుందని ఇప్పటికే ప్రకటించామని కవిత తెలిపారు. 

అధికారికంగా పార్టీని ప్రకటించే ముందు… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు చివరి నిమిషంలో కోరారని చెప్పారు. వారి అభిలాష మేరకు తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగినట్లు వెల్లడించారు. సొంత పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు మంచి ఫలితాలతో ఆదరించారని ఆమె అన్నారు. 

ఎన్నికల్లో ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని, మరో మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా… సుమారు 40 చోట్ల తమ కార్యకర్తలు గెలుపు అంచుల వరకు వెళ్లినట్లు కవిత తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ భవిష్యత్తుపై మరింత నమ్మకాన్ని కల్పించాయని కవిత తెలిపారు. అహంకారం లేని, పారదర్శక రాజకీయాలనే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని… ప్రజలు తమను విశ్వసించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజల మద్దతు ఉంటుందని ఆమె తెలిపారు

By
en-us Political News

  
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.