ఆంక్షలు ఉల్లంఘించి భారీ కాన్వాయ్ తో అవినాష్ రెడ్డి పర్యటన: అంకాలమ్మ గూడురులో తీవ్ర ఉద్రిక్తత.!
Publish Date:Nov 20, 2026
Advertisement
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19) టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఇది జరిగిన మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ ఖండించారు. అదలా ఉండగా, అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు. ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.!
[Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
http://www.teluguone.com/news/content/kadapa-mp-ys-avinash-reddy-25-237540.html





