విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.!
Publish Date:Nov 16, 2026
Advertisement
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎంకు ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకకు గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేశారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఈనాడు గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్, రామోజీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావు జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన తొమ్మిది మందికి ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రతిభావంతులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే ఈ పురస్కారాల ప్రధాన ఉద్దేశం. రామోజీరావుకు వెంకయ్యనాయుడు ఘన నివాళి.! మరోవైపు, విలువలతో కూడిన వ్యాపారం, సమాజహితమే జర్నలిజం అని ఆచరణలో చూపించిన మహామనిషి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు.రామోజీరావు పట్టుదల, స్వయంకృషి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి, కార్యదీక్ష భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన ప్రస్థానం.. ఈనాడు దినపత్రికతో పాటు రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి మహోన్నత వ్యవస్థల నిర్మాణంతో ప్రపంచస్థాయికి చేరిందని గుర్తుచేశారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు పేరు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని వెంకయ్యనాయుడు తన పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: డేటింగ్ యాప్‌లో వల..బీర్లో మత్తుమందు..ఆపై బంగారం మాయం.! [ Ramoji Excellence Awards, Ramoji Rao,Amit Shah, Chandrababu Naidu, Pawan Kalyan, Justice Abdul Nazeer, Venkaiah Naidu, Eenadu Group, CH Kiran, Ramoji Film City, Vijayawada, Andhra Pradesh ]
http://www.teluguone.com/news/content/ramoji-excellence-awards-25-237239.html




