అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.!
Published on: Fri Nov 20, 2026 9:54AM

కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపంలో శుక్రవారం (నవంబర్ 20) ఈ ఘటన జరిగింది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెడుతున్న సమయంలో అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది. అవినాష్‌రెడ్డి కాన్వాయ్ అంకాలమ్మ గూడూరు వద్దకు చేరుకోగానే దుండగులు పెట్రోల్ బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. దీంతో సింహాద్రిపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడితో పులివెందులలో కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడి ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతుననాయి. ఈ దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[Attack, YS Avinash Reddycanvoy, petrol bomb, Simhadripuram, TeluguOne]


