TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా?

Published on: Thu Nov 5, 2026 3:26PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. మొత్తం 100 స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు ఘన విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో  చర్చకు దారితీశాయి.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు మరియు 10 నగర పంచాయతీ ఎన్నికల్లో కేవలం మూడు మునిసిపాలిటీలు, అనంతపురం కార్పొరేషన్ మాత్రమే వైసీపీ గెలుచుకుంది.  మిగిలిన అన్ని స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి.   అనంతపురం  కార్పొరేషన్ లో వైసీపీ గెలవడానికి కారణం కూటమి సర్దుపాట్లలో భాగంగా అనంతపురం మేయర్ స్థానం బీజేపీకి వెళ్లడం వల్లనే. అక్కడ బీజేపీకి కనీస ఓటు కూడా లేకపోవడం వల్లనే ఆ కార్పొరేషన్ లో వైసీపీ గెలుచుకోగలిగింది.  

ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కడప జిల్లాలోని పులివెందుల ఫలితాలు. 1978 నుంచి ఇప్పటివరకు ఏకపక్షంగా వైఎస్ కుటుంబ సభ్యుల చేతిలోనే ఉన్న పులివెందులలో ఈసారి మాత్రం జగన్ కుదేలైంది.  

పులివెందుల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన జగన్ బాబాయి వైఎస్ మనోహర్ రెడ్డి వార్డు సభ్యుడిగా గెలిచినప్పటికీ, మున్సిపాలిటీ పీఠం కూటమిపరం అయ్యింది. పులివెందుల చైర్ పర్సన్ గా పోటీ చేసిన జగన్ సొంత పిన్ని వైఎస్ ప్రమీలమ్మ ఓటమి పాలయ్యారు. 

ఇది కూడా చదవండి: https://www.teluguone.com/news/content/ycp-candidates-drop-out-zptc-election-43-236378.html

వైసీపీకి ఇది కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదు.  మానసికంగా,  సంస్థాగతంగా కూడా చాలా దెబ్బ. అలాగే జగన్ కు వ్యక్తిగతంగా ఇది ఘోర పరాభవం.  గతంలో 2012 13 కాలంలోనూ జగన్మోహన్ రెడ్డి కష్టకాలం ఎదుర్కొన్నప్పటికీ, అప్పట్లో ఆయనపై ప్రజల్లో బలమైన ఆశలు ఉండేవి. కానీ, అధికారంలో ఉండి పాలన సాగించిన తర్వాత ఎదురైన ఈ పరాజయం పూర్వపు పరిస్థితులకు పూర్తిగా భిన్నం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

పార్టీలో  సంస్థాగత బలహీనతలు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో లోపాలు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కిందిస్థాయి నాయకత్వాన్ని నడిపించడంలో అధినేత వైఫల్యానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,  అధికార యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనే విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి.

అయినప్పటికీ,  2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పులివెందులలో జగన్ పట్టు ఇసుమంతైనాసడలలేదని గుర్తుచేసుకోవాలి. కాబట్టి అధికార దుర్వినియోగం కాదు, సంస్థాగత లోపాలు, జగన్ పైనా, జగన్ పార్టీపైనా ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మునిసిపోల్స్ లో వైసీపీ ఘోర పరాజయం ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడ్డట్టేనా అన్న ప్రశ్నలు కూడా పరిశీలకుల నుంచి వస్తున్నాయి. అయితే ఒక్క ఓటమి, లేదా రెండు ఓటములు ఒక పార్టీ, ఒక నాయకుడి పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడినట్లనని చెప్పలేమని కూడా అంటున్నారు. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ పుంజుకుని 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. 

ఇందుకు మరి కొందరు 2019  నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ తీరు ప్రజలకు పూర్తిగా అవగతమైంది కనుక ఆయన పాలనపై కొత్తగా జనం ఆశలు పెట్టుకునే అవకాశం ఉండదని అంటున్నారు. మొత్తం మీద పొలిటికల్ గా జగన్ కు ఆయన పార్టీకి మునిసిపోల్స్ పరాజయం ముందు ముందు రాజకీయంగా గడ్డుకాలమేనని చాటుతున్నాయని అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు: https://www.teluguone.com/news/content/ycp-candidates-drop-out-zptc-election-43-236378.html

https://www.teluguone.com/news/content/chandrababu-naidu-parishad-elections-target-43-236376.html 


[YCP Electoral Collapse in Municipolls, AP Local Body Elections,  Pulivendula,  Results, YS Bsaton, Telugu One]