భలే మంచి ఓటు బేరమూ!
Publish Date:Nov 8, 2025
Advertisement
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్న ఓటర్లు మాత్రం దేవుళ్లతో సమానం.. కారణం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు చావోరేవో పరిస్థితి. అధికార కాంగ్రెస్ ఇక్కడ గెలవకుంటే అధికారంలో ఉండీ లేనట్టే అని భావిస్తున్న పరిస్థితి. ఇక బీఆర్ఎస్ ఇక్కడ ఓటమి పాలైతే.. రాష్ట్రంలో ఇక ఉనికి కోల్పోయినట్లే అని భయపడుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. 2028లో అధికారంలోకి రావాలన్న ఆశ అడియాశ అయినట్లే అని బెంబేలెత్తే పరిస్థితి. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో విజయం సాధిస్తే.. 2028 ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి రాచబాట వేసుకున్నట్లే అన్న నమ్మకంతో ఉంది. ఎందుకంటే జూబ్లీ బైపోల్ లో బీజేపీకి డిపాజిట్ వస్తే ఆ పార్టీకి గెలుపుతో సమానం అని ఎద్దేవా చేశారు. అంతే కాదు ఇక్కడ బీజేపీ తన డిపాజిట్లు కోల్పోతే.. కేంద్రంలో మోడీ సర్కార్ పాలనకు ఇది రెఫరెండంగా భావిస్తారా? అని సవాల్ కూడావిసిరారు. ఇక సర్వేలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే, దానిపై కూడా రేవంత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయా సర్వే కంపెనీల వారు.. ఆయా పార్టీల నుంచి డబ్బు తీసుకుని ఆయా పార్టీలకు వంత పాడతారని, వాటిని సర్వేలని తాము అనుకోలేమని తీసిపారేశారు. ఎందుకంటే గతంలో సారు- కారు- పదహారు అన్నది వీరేనని.. ఆ తర్వాత ఆ సంఖ్య ఎంత పెద్ద ఎత్తున తగ్గిందో తెలిసిందేననీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలూ జూబ్లీ బైపోల్ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదంటున్నారు పరిశీలకులు. దీంతో ఇక్కడి ఓట్ల కొనుగోలు ప్రక్రియ మొదలైపోయిందంటున్నారు. ఓటుకు రెండు వేలు, మూడు వేలు అంతకన్నా ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. పోలింగ్ తేదీనాటికి ఓటు ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోవడం లేదంటున్నారు. ఎందుకంటే జూబ్లీ బైపోల్ మూడు పార్టీలకూ అత్యంత ప్రతిష్ఠత్మకం కనుక అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jublee-by-poll-45-209187.html





