జూబ్లీ బైపోల్.. గెలుపోటములతో పాటు.. పోలింగ్ శాతంపైనా చర్చ!

Publish Date:Nov 6, 2025

Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వేడి పెరిగింది. విమర్శల ఘాటు తీవ్రమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో జూబ్లీపైపోల్ లో ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిని మించి అసలు జూబ్లీలో పోలింగ్ శాతం ఎంత నమోదౌతుందన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. తప్పకుండా డిబేట్ జరిగే పాయింట్ ఇది. తక్కువ పోలింగ్ శాతం.. ఇక్కడి ఎన్నికని ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి.. పోలింగ్ భారీగా నమోదవుతుందా? లేక.. ఎప్పటిలాగే 50 శాతం లోపే ఉంటుందా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.  ఒకవేళ.. తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఎవరికి నష్టం జరుగుతుంది? ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. దానివల్లే, ఈ ఉపఎన్నికలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్లు గడప దాటి, పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి.. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారా? లేక.. మెజారిటీ ఓటర్లు.. ఎప్పటిలాగే.. ఎవరైతే ఏముంది? మాకొచ్చేదా? పోయేదా? అని లైట్ తీసుకొని.. రిలాక్స్ అవుతారా? అన్నదానిపై రకరకాల చర్చ జరుగుతోంది.

ఒక్కసారి జూబ్లీహిల్స్ పోలింగ్ హిస్టరీని చూస్తే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి జూబ్లీలో పోలింగ్ ట్రెండ్ ను ఓ సారి పరిశీలిస్తే.. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రమే.. జూబ్లీహిల్స్‌లో 50.1 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్ రికార్డ్. అంటే అంతకు ముందు ఇక్కడ భారీ పోలింగ్ జరిగిందని కాదు. మరీ గతంలోకి పోకుండా.. తెలంగాణ ఆవిర్భావం తరువాత నుంచి మాత్రమే మన పరిశీలనకు తీసుకుందాం. సరే 2014లో జూబ్లీ నియోజకవర్గంలో 50.1శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరిగిందని చెప్పుకున్నాం కదా.. 2018 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి 5 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అప్పుడు కేవలం.. 45.5 శాతం  మాత్రమే పోలింగ్ నమోదైంది.  ఆ తరువాత  జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. మళ్లీ 5 శాతం పోలింగ్ పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన పోలింగ్ కేవలం 39.8 శాతం  మాత్రమే. గత గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇక్కడ పోలింగ్ 50శాతం దాటలేదు.  2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  జూబ్లీహిల్స్‌లో  47.5 శాతం ఓటింగ్  నమోదైంది. 2014 ఎన్నికల తర్వాత ఇదే హయ్యెస్ట్. అయితే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి పోలింగ్ శాతం మళ్లీ రెండు శాతం తగ్గి  45.5 శాతం మాత్రమే నమోదైంది.  అంటే 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్నడూ 50శాతం పోలింగ్ నమోదు కాలేదు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ ఏరియాలున్నాయ్. ఓ వైపున సంపన్నులుంటే.. మరోవైపు సాధారణ ప్రజలు ఉంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే.. పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మరోవైపు.. స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయ్. ఇక్కడి ఓటర్లే.. ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి.. ఈ బైపోల్ విషయంలోనైనా.. జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా? లేక.. ఎప్పటిలాగే మెజారిటీ ఓటర్లు ఈ ఉపఎన్నికని కూడా లైట్ తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో.. పోలింగ్ శాతంపై కూడా అంతే డిబేట్ నడుస్తోంది. ఈ ఉపఎన్నికలో.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. గట్టిపోటీ ఉన్నప్పుడు, ఒక్క బైపోల్‌.. మొత్తం స్టేట్ రాజకీయాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నప్పుడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయ్. ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందువల్ల.. జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా.. ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా.. మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను.. పోలింగ్‌కు రప్పించడానికి పార్టీలు మరింత ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించే వారు.. పోలింగ్‌లో పాల్గొనేలా చూసేందుకు.. పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అప్పీల్స్ చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ.. వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా? లేదా? అనేదే.. ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో నమోదైన మొత్తం ఓటర్లలో.. దాదాపు 22 శాతం మంది 29 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా.. ఉద్యోగాలు, విద్య, మౌళిక వసతుల లాంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీరి టర్నౌట్ గనక పెరిగితే.. పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందనే అంచనాలున్నాయ్. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే.. ఇక్క 50 శాతం పోలింగ్ టచ్ కావడం కాస్త కష్టమే అయినప్పటికీ.. పార్టీల మధ్య నెలకొన్న బలమైన పోటీ, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, పార్టీల నేతలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రప్పించడంలో చూపించే శ్రద్ధ మీదే ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరగడమా? తగ్గడమా? ఎప్పటిలాగే నమోదవడమా? అనేది ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.