వేల కోట్ల అవినీతి నిగ్గు తేల్చండి!ప్రధానికి జైలు నుంచి జర్నలిస్ట్ రఘు లేఖ.. 

Publish Date:Jun 4, 2021

Advertisement

తొలివెలుగు యూట్యూబ్​ చానల్​ జర్నలిస్ట్​, యాంకర్​ రఘు అరెస్ట్ తెలంగాణలో కలకలం రేపుతోంది. జర్నలిస్ట్ రఘు అరెస్టును విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ అవినీతి ప్రశ్నిస్తున్నారనే కసితోనే కేసీఆర్ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతున్నాయి. 

గురువారం ఉదయం జర్నలిస్టును రఘును నెంబర్ లేని కారులో తీసుకెళ్లడంలో .. కిడ్నాప్ జరిగిందనే ప్రచారం జరిగింది. తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా రఘును తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పడం దుమారం రేపింది.  "కోకాపేట కాందిశీకుల  భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేస్తే.. ఖబడ్దార్" అంటూ దుండగులు పెద్దపెట్టున కేకలు వేస్తూ జర్నలిస్ట్ రఘును బలవంతంగా జీపు ఎక్కించినట్లు రఘు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సాయంత్రానికి తామే అరెస్ట్ చేశామంటూ సూర్యాపేట పోలీసులు ప్రకటన చేశారు. గుర్రంపోడులో జరిగిన గొడవకు సంబంధించి  జర్నలిస్ట్​ రఘుపై ఐపీసీ IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈకేసులో రఘు A-19గా ఉన్నాడు. 

కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం హజూర్ నగర్ జైలులో ఉన్నారు  జర్నలిస్ట్ రఘు. అక్కడి నుంచే రఘు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వేల కోట్ల అవినీతికి సంబంధించిన కథనాలు ప్రసారం చేస్తుండటం వల్లే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రధానికి రాసిన లేఖలో రఘు ఆరోపించారు. ప్రధాని మోడీకి రఘు రాసిన లేఖ.. ఉన్నది ఉన్నట్లుగా ఇస్తున్నాం.. కింద చూడండి.. 

గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాన‌మంత్రిగారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా...

విష‌యం: తెలంగాణ‌లో ఎమ‌ర్జెన్సీ మ‌రియు వేలకోట్ల దోపిడి గురించి.

నా పేరు ర‌ఘు గంజి. తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. నిన్న ఉద‌యం నా ఇంటి స‌మీపంలో కొంద‌రు న‌న్ను కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్త‌ల ప్ర‌సారం ఆపితేనే  నేను ప్రాణాల‌తో బ‌తుకుతాన‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కిడ్నాప్ చేసిన‌వారు పోలీసుల‌ని తెలిసింది. సోష‌ల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైర‌ల్ కావ‌డంతో న‌న్ను వారు కోర్టులో హాజ‌రుప‌రిచి జైలుకు పంపించారు. ప్ర‌స్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను.

కిడ్నాప్ చేసిన పోలీసులు.. న‌న్ను వార్త‌లు ప్ర‌సారం చేయొద్ద‌ని కోరిన 5 అంశాలు
1. పుప్పాల‌గూడ కాందీశీకుల భూమి ఆక్ర‌మ‌ణ‌
2. ఐడీపీఎల్ 500 ఎక‌రాల ఆక్ర‌మ‌ణ‌
3. ఐకియా ముందు 43 ఎక‌రాల భూమి ఆక్ర‌మ‌ణ‌
4. ప్రాజెక్టుల దోపిడి
5. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో క‌రోనా ట్రీట్‌మెంట్ దోపిడి

1. పుప్పాల‌గూడ‌లో 100 ఎక‌రాల కాందీశీకుల భూమి ప్ర‌స్తుతం ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతుల‌ను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూక‌బ్జా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు అధికార పార్టీ నేత‌లు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తిలిస్తున్నారు. నేను ఆ విష‌యం గురించి రిపోర్ట్ చేయ‌కూడ‌ద‌ట‌.

2. ఐడీపీఎల్/ హిందుజ /గ‌ల్ప్ ఆయిల్‌కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్ర‌భుత్వ పెద్ద‌లు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విష‌యం గురించి కూడా నేను మాట్లాడ‌కూడ‌ద‌ట‌

3. హైటెక్ సిటీ స‌మీపంలో ఐకియాకు ముందు యూఎల్‌సీకి స‌రెండ‌ర్ చేసిన 35,36,47,53 స‌ర్వే నెంబ‌ర్ల భూమి ప్ర‌భుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వ‌చ్చిందో ప్ర‌శ్నించ‌కూడ‌ద‌ట‌.

4. రాష్ట్రంలో మిష‌న్ భ‌గీరథ‌తో పాటు ప్రాజెక్టుల‌న్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జ‌రిగింది. ఆ డ‌బ్బంతా రాజ‌కీయ నాయ‌కుల‌కు చేరింది. ప‌క్క రాష్ట్రం క‌ర్నాట‌క‌తో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విప‌రీత దోపిడి జ‌రిగింది. ఆ ప్రాజెక్టులు, టెండ‌ర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడ‌ద‌ట‌.

5. క‌రోనా స‌మ‌యంలో విప‌రీత‌మైన దోపిడికి తెగ‌బ‌డి శ‌వాల‌తో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై క‌థ‌నాల‌ను త‌క్ష‌ణం ఆపివేయాల‌ట‌.

ప్ర‌ధానమంత్రిగా మిమ్మ‌ల్ని ఈ అంశాల‌పై దృష్టి సారించాల‌ని కోరుతున్నాను.  క‌నీస పౌర‌హ‌క్కులు, ప‌త్రికా స్వేచ్ఛ‌లేని తెలంగాణ ప‌రిస్థితిని మీరు   మారుస్తార‌ని ఆశిస్తున్నాను. నా ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని కోరుతున్నా...

                      గౌర‌వంతో                              

   ర‌ఘు గంజి       (    హుజూర్‌న‌గ‌ర్  జైలు నుంచి) 

By
en-us Political News

  
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.