చదువుకోండిరా బాబూ!

Publish Date:Feb 13, 2016

Advertisement

మన పెద్దవాళ్లని ఎవరనినన్నా కదిపితే... ‘అప్పట్లో మాకు చెప్పేవాళ్లు లేక సరిగా చదువుకుని ఏడవలేదు. కనీసం మీరన్నా బుద్ధిగా చదువుకోండిరా బాబూ!’ అని కళ్లెమ్మట నీళ్లు పెట్టుకున్నంత పనిచేస్తారు. కానీ చదువు సంగతి దేవుడెరుగు... అసలు తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో యువత ఉంటే, దేశం ఎలా బాగుపడుతుంది? యువకులకు ఆవేశం ఉండటంలో తప్పు లేదు- అది వారి స్వభావం! మనుషులకు భావస్వేచ్ఛ ఉండటంలో తప్పులేదు- అది వారికి అవసరం! కానీ ఆ ఆవేశానికి ఒక దిశ అంటూ లేకపోతే, వారి భావస్వేచ్ఛలో విచక్షణ లేకపోతే?

దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంగా దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీని భావిస్తారు. ఇక్కడి ప్రాంగణంలో విద్యకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆలోచనకీ అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే దిగ్విజయ్‌ సింగ్‌ మొదలుకొని సీతారాం ఏచూరి వరకూ వందలాది రాజకీయ నాయకులను ఈ దేశానికి అందించింది. కానీ అదే విశ్వవిద్యాలయం ఇప్పుడు వార్తలలో నిలిచింది. ఫిబ్రవరి 9 2016 నాటికి అఫ్జల్ గురు అనే తీవ్రవాదిని ఉరితీసి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు అఫ్జల్‌ గురుకి అనుకూలంగా సభను నిర్వహించారన్నది ఒక ఆరోపణ.

అఫ్జల్ గురు అమాయకుడేమీ కాదు... పాకిస్తాన్‌లో తీవ్రవాదుల దగ్గర ఓనమాలు నేర్చుకుని మన దేశపు పార్లమెంటు మీద దాడి చేసేందుకు సహకరించినవాడు. మరో దేశంలో ఇలాంటి పని చేస్తే ఎంత త్వరగా చర్యలు తీసుకుంటారో కానీ, మన దేశంలో అతనికి 12 సంవత్సరాల తరువాత 2013లో రహస్యంగా ఉరితీశారు. మనుషులని ఉరితీయడం అన్న సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించవచ్చు, అందులోనూ రహస్యంగా ఉరితీసిన విధానాన్ని నిరసించవచ్చు. కానీ... ‘నువ్వు (అఫ్జల్) తలపెట్టిన కార్యక్రమాన్ని మేం పూర్తి చేస్తాం’ అని ఎవరన్నా నినదిస్తే వారిని దేశద్రోహులుగా ఎందుకు భావించకూడదు. ‘భారతదేశం నాశనం అయ్యేదాకా, మేం పోరాడుతూనే ఉంటాం’ అని ఎవరన్నా ప్రతిజ్ఞ చేస్తే అది భావస్వేచ్ఛగా ఎలా అనుకోగలం.

సరే! మనుషులన్నాక రకరకాలు ఉంటారు. అందులో కొందరికి అఫ్జల్‌గురు నచ్చవచ్చు. కానీ అలాంటి మనుషుల చుట్టూ అల్లుకుంటున్న రాజకీయమే ఇప్పుడు మరింత కలవరపరుస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా, అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం భావస్వేచ్ఛ అనీ, సహృద్భావ చర్చలో భాగం అనీ కొందరు రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఖండించాల్సిన సందర్భంలో అలా చేయడం తమ పార్టీలకు అవమానంగా భావిస్తున్నారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. ఈ దేశం గురించి మాట్లాడే హక్కు ఒక్క RSS, ABVP, BJP వంటి సంస్థలకు మాత్రమే లేదుకదా! మరి దేశభక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడితే అది BJPకి లాభపడుతుందనుకుని విభిన్నమైన స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నట్లు? దళితులకు అన్యాయం జరిగితే ఒక పార్టీ, అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక పార్టీ; దేశభక్తి గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ, దేశంలోని వివాదాల గురించి మాట్లాడాలంటే ఒక పార్టీ... ఇలా ఈ దేశ ప్రజల్నీ, దేశ సమస్యలనీ... ఆఖరికి దేశభక్తిని కూడా పార్టీలవారీగా పంచేసుకున్నారా ఏంటి?

రాజకీయ వేత్తల నుంచి ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలను ఆశించలేము. కానీ కనీసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులన్నా ఈ పరిస్థితి గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చినట్లుంది. తమ పిల్లలు లక్షలు సంపాదించే ఉద్యోగాలు సాధించాలనుకునే తల్లిదండ్రులు, ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి చేతులు దులిపేసుకునే ఉపాధ్యాయులూ... అసలైన బాధ్యత అది కాదనీ, ఒక మంచి పౌరుడిని ఈ దేశానికి అందించడంలోనే తమ జీవితానికి సార్థకత ఉందనీ గ్రహించాల్సిన సమయం వచ్చినట్లుంది. యాదృచ్ఛికమో మరేదో కానీ దిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ సభ జరిగిన రోజే సియాచిన్‌లో హనుమంతప్ప అనే సైనికుడు చావుబతుకుల మధ్య కనిపించాడు. దేశం కోసం 20000 అడుగుల ఎత్తున, -50 డిగ్రీల చలిలో, చావుతో సహజీవనం చేసే వేలాది సైనికులలో హనుమంతప్ప ఒకడు. అదృష్టమో, దురదృష్టమో కానీ హనుమంతప్ప మృత్యువుతో పోరాడుతూ దిల్లీలోనే చనిపోయాడు. అతనికి స్పృహ వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రజల కోసమా నా జీవితాన్ని అంకితం చేసింది అనుకునేవాడేమో కదా!

చదువుకోండిరా బాబూ! మీరంతా మరో హనుమంతప్పలా మారనవసరం లేదు. కనీసం మన దేశాన్ని కాలపా కాస్తున్న సైనికులు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు తీసుకురాకండి.

By
en-us Political News

  
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.