అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!
Publish Date:Jun 16, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు విజన్ కు దర్పణం పట్టేవిధంగా రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరం అమరావతి కేవలం భవనాల నగరం మాత్రమే కాదు.. ఈ మహానగరం అందరికీ కొత్త అనుభూతిని పంచే ఎక్స్‌పీరియన్స్ సిటీ గా రూపుదాల్చాలన్నదే చంద్రబావు విజన్. ఇటీవలి సింగపూర్ పర్యటన, అలాగే అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీని నిర్మించి.. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటం వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీల సమ్మేళనంగా అమరావతి రూపుదిద్దుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా స్మార్ట్, బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్‌తో అమరావతి రూపుదిద్దుకుంటోంది. దేశవిదేశీ సంస్థలను, ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఇక్కడికి ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీబీఎన్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యూఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చ్యేతో జరిపిన భేటీలో.. అమరావతిలో ఎన్‌యూఎస్, బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలకు అమరావతిని వేదికగా మార్చాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే..గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న సింగపూర్ బృందం, మళ్లీ ఇప్పుడు రాజధాని నిర్మాణ పురోగతిని తెలుసుకుని ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహంలో అత్యంత కీలకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్.. భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమరావతి దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించబోయే అద్భుతమైన ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ కోసం 1,208.41 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే సెక్రటేరియట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్ల ఫాసాడ్, స్ట్రక్చరల్ పనుల కోసం రెండు వేల 540 కోట్ల రూపాయలు, అసెంబ్లీ భవన పనుల కోసం 798 కోట్ల రూపాయలు కేటాయించారు. కృష్ణా నదిపై పాతిక వందల కోట్లతో నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే.. బిట్స్ పిలానీ వంటి ప్రముఖ సంస్థలు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరావతి క్యాంపస్‌ను సిద్ధం చేస్తున్నాయి. 2027 నాటికి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించి, దాదాపు పదివేల మంది విద్యార్థులకు క్వాంటమ్, ఏఐ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం విద్యారంగమే కాకుండా గ్యాస్, పవర్, వాటర్ సప్లై కోసం అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన మౌలిక వసతులతో అమరావతి నిజమైన గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ సిటీగా అవతరించబోతున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ వేదికగా చంద్రబాబు.. ఎవరైతే సుదీర్ఘకాలం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనుకుంటున్నారో.. వారు అమరావతికి రావాలి అంటూ పిలుపునిచ్చారు. కాలుష్య రహిత వాతావరణం, గ్రీన్-బ్లూ సిటీ కాన్సెప్ట్, అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డక్ట్ సిస్టమ్స్ ద్వారా అమరావతిని గ్లోబల్ లెవన్ జీవన ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, మరెన్నో పొలిటికల్ చాలెంజెస్ ఎదురయ్యాయి. చంద్రబాబు పట్టుదల, అకుంఠిత దీక్ష, విజన్ తో వాటన్నిటినీ అధిగమించి.. దేశంలోనే తొట్ట తొలి సస్టైనబుల్ గ్లోబల్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/sustainable-global-city-amarawathi-45-223098.html




