Publish Date:Mar 28, 2013
న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లాడు. న్యూజిలాండ్ లోని క్రిస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఓ బార్ వద్ద జరిగిన గొడవలో రైడర్ ను కొందరు తీవ్రంగా కొట్టడంతో అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రైడర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రైడర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాలతో ముడిపడిందే. మద్యానికి బానిసైన రైడర్ పలుమార్లు తప్పతాగి వివాదాల్లో చిక్కుకున్నాడు. జట్టు నుంచి అనేకసార్లు అతణ్ని తప్పించారు. మరో ఆరు రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ ఆరో సీజన్లో రైడర్ పుణె వారియర్స్ తరఫున ఆడాల్సి ఉంది. గత ఏడాది ఆ జట్టు తరఫున రైడర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా రైడర్ పై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. గతంలో రైడర్ తో గొడవపడిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చి అతనిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jesse-ryder-in-coma-after-bar-brawl-in-christchurch-36-22013.html
అప్పన్న ఫ్యామిలీకి సేవాభావంతో రూ.50 వేల చెక్కు అందించినట్టు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
కుల్సుంపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు.
భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు.
విద్యా బుద్దులు నేర్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు.
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల రాష్ట్రం దశ డా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఇండిగోలో అసలు సమస్య ఏంటి అని చూస్తే కొత్త పైలట్ డ్యూటీ రూల్స్
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తిరుమల పరాకామణి కేసు నిందితుడు రవికుమార్ తప్పు అంగీకరిస్తూ వీడియోను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శనివారం పరిశీలించారు.