కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్లుకు కీలక పదవులు..రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!.

Publish Date:Aug 13, 2026

Advertisement

 

హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతర్గత అసంతృప్తులు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం తీవ్ర బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

తాను అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అరాచకాలపై తొలిసారిగా గళమెత్తింది తానేనని, ఆ కారణంతోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని గుర్తుచేశారు. మునుగోడు ఉపఎన్నికలో తనను ఓడించేందుకు ఏకంగా వంద మంది ఎమ్మెల్యేలను రప్పించి మోహరించారని పేర్కొన్నారు.

అంతేకాకుండా, తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులం కార్డును అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాప్రతినిధులు నిజాయితీగా లేకపోతే వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయ చిత్రాన్ని మార్చే శక్తి తన వద్ద ఉందని, నిజాయితీ కలిగిన వ్యక్తులు తన వెంట నిలిస్తే తమిళనాడు తరహా రాజకీయ విప్లవాన్ని తెలంగాణలోనూ తీసుకురాగలమని ధీమా వ్యక్తం చేశారు. ఏపూరి సోమన్న లాంటి ప్రజా కళాకారులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ అంతర్గత విభేదాలు మరింత శృతిమించక ముందే అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Komatireddy Rajgopal Reddy, Telangana Congress, Munugode MLA, Epuri Somanna, Telangana Politics
 

By
en-us Political News

  
గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వేదికగా భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయ
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.