జగన్‌కే చుక్కలు చూపించిన జేసీ బ్రదర్స్

Publish Date:May 7, 2022

Advertisement

వస్త్ర ప్రపంచంలో చందనా బ్రదర్స్.. టాలీవుడ్‌లో పరుచురి బ్రదర్స్.. ఏపీ పాలిటిక్స్‌లో జేసీ బ్రదర్స్.. వెండి తెర మీద పరుచురి బ్రదర్స్ డైలాగ్స్ ఎలా పేలతాయో.. ఏపీ పాలిటిక్స్‌లో అదీ రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ జేసీ బ్రదర్స్ రాజకీయం అంత రంజు రంజుగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ జేసీ బ్రదర్స్ స్టైలే వేరు.. మాట.. నడక.. నడత అంతా సపరేటే. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాంటే.. సీమ భాషకు బూతులు జోడించి వీరు మాట్లాడుతుంటే.. ఓ విధమైన హాస్యం ఉట్టిపడుతోందని తెలుగు నేలపై రాజకీయం తెలియని వారు సైతం వీరి గురించి పేర్కొంటారు. ఈ జేసీ బ్రదర్స్ ఏదీ మాట్లాడినా.. ఏం చెప్పినా అంతా ముఖం మీదే చెప్పేస్తారు. 

నో రహస్యాలు.. నో మోహమాటాలు.. అంతా  బొమ్మరిల్లు మూవీలో హీరోయిన్ హాసిని టైప్ అన్నమాట. అంతేకాదు ఈ బ్రదర్స్‌కి గట్స్ కూడా ఎక్కువే. నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను మీడియా సాక్షిగా నట్ట నడిరోడ్డు మీద బండ బూతులు తిట్టినా అదీ ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికే చెల్లింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు గారు.. మీరు మారాలండి అంటూ లక్షలాది మంది హాజరైన మహానాడు వేదికగా చెప్పినా.. అదీ జేసీ దివాకర్ రెడ్డికే చెల్లింది. ఫ్యాన్ పార్టీ ఎన్నికల్లో గెలిచాకా.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఈ జేసీ బ్రదర్స్‌కి గట్టి దెబ్బ తగిలింది. వీళ్ల వ్యాపారాలన్నీటికి అంటే అల్ మోస్ట్ ఆల్ అన్నింటికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. 

ఇది జస్ట్ విరామం మాత్రమేనని ఈ జేసీ బ్రదర్స్ సన్నిహితులు పేర్కొంటున్నారు. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఫ్యాన్ పార్టీ జెండ రెపరెపలాడింది. కానీ వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడిపత్రి మున్సిపాలిటిలో మాత్రం సైకిల్ పార్టీ జెండా రెపరెపలాడడంతో.. ఆ పార్టీ నేతల్లో విజయ గర్వం సైతం తొణకిసలాడింది. ఇది జేసీ బ్రదర్స్ సత్తా అని సీఎం జగన్‌కు సైతం అర్థమైందని ఫ్యాన్ పార్టీ నేతలే పేర్కొనడం గమనార్హం. 

ఓ వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజభనకు కసరత్తు జరిగుతోంటే.. రాయల్ తెలంగాణ అంటూ కొత్త పల్లవి అందుకున్నారీ దివాకరరెడ్డి. అంతేకాదు.. తమ మాటకు విలువివ్వని కాంగ్రెస్ అధిష్టానాన్ని వీడి.. తన తమ్ముడి ప్రభాకరుడితో సహా సైకిల్ పార్టీలోకి వచ్చేశాడీ దివాకరుడు.. ఆ తర్వాత అనంత ఎంపీగా ఆయన గెలవడం.. అలాగే ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఇద్దరు ఓటమిపాలైయ్యారు. కానీ తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచి.. ఆ మున్సిపాలిటికీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయ్యారు. 

అంతేకాదు.. సదరు మున్సిపాలిటిని ఆయన ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దిన తీరు పట్ల రాష్ట్ర ప్రజలే అచ్చెరువొందుతున్నారు. అలాగే తాడిపత్రి రహదారులు సైతం అద్దంలా మార్చారు ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి కొద్దిగా కామ్ అయినా.. రానున్న ఎన్నికల్లో మళ్లీ సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి.. జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని ఒక తాటిపైకి తీసుకు వస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ జేసీ బ్రదర్స్ పేర్లు దివాకర్, ప్రభాకర్..  అంటే ఒకటే అర్థం. ఈ బ్రదర్స్ భవిష్యత్తు ముందే ఊహించి మరీ వీరి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారని.. ఓ టాక్ అయితే అనంత జిల్లాలో మస్త్ మస్త్‌గా నడుస్తోంది.

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.