జగన్.. విద్యార్ధుల పట్ల ఎందుకీ కక్ష?
Publish Date:Jul 9, 2022
Advertisement
నిన్నటిదాకా టాటా చెప్పి చిన్న బ్యాగుతో పరుగున పక్కవీధిలోనో, కాస్తంత అవతలో వున్న బడికి పిల్లలు వెళ్లేవారు. తల్లిదండ్రులూ తమ పనుల్లో ప్రశాంతంగా కాలం గడిపేవారు. పిల్లలు బడి కాగానే ఇంటికి రాగలరనో, మరీ అవసరమైతే వెళ్లి తీసుకురావచ్చని. కానీ ఈ ఆనందం వారికి జగన్ ప్రభుత్వం దూరం చేసింది. అంతగా విద్యార్ధులు లేని, ఉపాధ్యాయులు అంతగా లేని స్కూళ్లన్నీ బాగా నడుస్తున్న, దూరంగా వున్న స్కూళ్లలో కలిపే నిర్ణయం పిల్లలకు బాగా ఇబ్బందికరంగా మారింది. కానీ ప్రభుత్వ నిర్ణయం ఏ మేరకు సవ్యమైనదని ఇప్పటికే చిన్నతరగతుల తల్లిదండ్రులు, చాలామంది ఉపాధ్యాయులు, ఉపాధ్యా య సంఘాలవారూ ప్రభుత్వ నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. గతంలో కంటే ఇపుడు కనీసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుందన్నమాట. కొత్త విద్యాసంవత్సరం ఇంకా పూర్తిగా తరగతులు ఆరం భం కాకుండానే ఇపుడీ పరిస్థితులు కల్పించి ప్రభుత్వం చిన్న తరగతుల పిల్లల తల్లిదండ్రులు ప్రయి వేటు స్కూళ్లవేపు వెళ్లే ఆలోచన కల్పించింది. ప్రభుత్వ మొండి వైఖరి 2 లక్షల మందికి పైగా చిన్నారులకు కష్టం తెచ్చి పెట్టింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ పిల్లలకు టీసీలు ఇవ్వా లని ఉపాధ్యాయులను డిమాండ్ చేస్తున్నారు. ఓపిక పట్టాలని ఉపాధ్యాయులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా తల్లిదండ్రులు వినడం లేదు. గందర గోళం మధ్య పిల్లలను ప్రభుత్వ బడులకు పంపలేమని, టీసీలు ఇస్తే దగ్గర్లో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తామ ని కోరుతున్నారు. ప్రతి ఏటా తక్కువ సంఖ్యలో 2, 3, 4 తరగతులకు టీసీలు ఇచ్చేవారు. కానీ ఈ ఏడాది భారీగా టీసీలు ఇవ్వాల్సి వస్తోందని, ఇది ఎక్కడి వరకూ వెళ్తుం దోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకు న్న విద్యార్థులు టీసీలు తీసుకుని ఎక్కువగా ప్రైవేటు బాట పడుతున్నారు. ప్రభుత్వ ప్రీ హైస్కూ ల్ లో 98 మంది విద్యార్థులు లేకపోతే సబ్జెక్టు టీచర్లు ఉండరు. దీంతో సబ్జెక్టు టీచర్లతో చదువు చెప్పించు కోవాలనే ఉద్దేశంతో ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో 5250 ప్రాథమిక పాఠశాలలను ప్రీ హైస్కూళ్లు, ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశారు. ఆ పాఠ శాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఒక్కో తరగ తికి కనీసం 15 మంది విద్యార్థులున్నా, రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పక్క గ్రామాలకు, ఇతర పాఠ శాలలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 6, 7, 8 తర గతులను 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఆ విద్యార్థులు కూడా దూరంగా ఉండే బడికి వెళ్లక తప్పదు. విలీన ప్రక్రియను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ పిల్లలను వేరే బడులకు పంపబోమని, ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది తగ్గిన హాజరు బడులు తెరిచి నాలుగు రోజులైనా విద్యార్థుల హాజరు పెరగడం లేదు. మొత్తంగా చూస్తే ప్రభుత్వ అధీనంలోని పాఠశాలల్లో హాజరు 72 శాతం దాటడం లేదు. అంటే ప్రతి నలుగురు విద్యా ర్థుల్లో ఒకరు ఇంకా బడికి వెళ్లలేదు. ఇంతకుముందు బడి తెరిచిన రోజే తల్లిదండ్రులు పిల్లలను పంపే వారు. ఈ ఏడాది 4 రోజులైనా హాజరు పెరగలేదు. శుక్రవారం నాటికి ఎయిడెడ్‌లో 67%, ప్రభుత్వ పాఠశాల ల్లో 64%, కేజీబీవీల్లో 33%, మోడల్ స్కూళ్లల్లో 69%, ఎంపీ-జడ్పీ పాఠశాలల్లో 74%, మున్సిపల్ స్కూళ్లలో 69% మాత్రమే హాజరు నమోదైంది. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో 79% హాజరు ఉండటం గమ నార్హం. ఈ ఏడాది 47 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తారని అంచనా ఉండగా, 22 లక్షల మంది మాత్రమే వచ్చారు. అమ్మఒడితో ప్రైవేటు బాట! ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి ఈ ఏడాది అమ్మఒడిని జనవరి నుంచి జూలైకి మార్చింది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు అదే సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్ కొంప ముంచుతోంది. సరిగ్గా పాఠశాలల ప్రారంభ సమయంలో అమ్మ ఒడి నగదు వేయడం.. ఇప్పుడే విలీన ప్రక్రియ మొదలు కావడంతో.. ఆ నగదుతో ప్రైవేటు స్కూ ళ్లలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సర్కారు బడులు యథాతథంగా కొనసాగి ఉంటే చాలా వరకు అక్కడే చదువుకునేవారు. కానీ ప్రభుత్వ వైఖరితో ఇపుడు అందరూ ప్రయివేటు బడుల వేపు మళ్లేలా చేస్తుంది.
http://www.teluguone.com/news/content/jaganwhy-this-aversion-towards-students-25-139391.html





