సీజేఐకి కొడి కత్తి కేసు నిందితుడి తల్లి లేఖ

Publish Date:Jul 9, 2022

Advertisement

ఏరు దాటే వరకూ ఓడ మల్లయ్య... ఏరు దాటిన తరువాత  బోడి మల్లయ్య అన్న తీరు వైసీపీ అధినేత జగన్ ది. బాబాయ్ హత్య కేసు విచారణ సీబీఐతో జరిపించాలని విపక్ష నేతగా డిమాండ్ చేసిన ఆయన ఆ తరువాత స్వయంగా సీబీఐ విచారణ అవసరం లేదని అనేశారు.

అలాగే కోడి కత్తి కేసులో కూడా విపక్షం తనపై హత్యాయత్నం చేయించిందంటూ విపక్ష నేతగా ఊరూవాడా ఏకం చేసింన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు ఊసెత్తడమే మానేశారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. కోడి కత్తి కేసు గుర్తుందా?  విపక్ష నేతగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ హైదరాబాద్ వచ్చేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో ఓ యువకుడు ఆయనపై దాడి చేశారు. ఆ దాడిలో జగన్ కు స్వల్ప గాయమైంది. ఈ దాడిని ఓ యువకుడు కోడి కత్తితో చేశాడు. అందుకే  ఆ కేసును అందరూ కోడి కత్తి కేసుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఈ దాడి వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ ఆరోపణలు సైతం గుప్పించింది. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. బాబు పాలనలో తనకు రక్షణ లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. దీంతో ఈ కేసు విచారణకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. అదంతా వేరే సంగతి.   ఈ సంఘటన తరువాత కోడి కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ అనే  యువకుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సరే ఈ ఘటన జరిగి సంవత్సరాలైపోయింది.

ఇప్పుడీ కేసు ప్రస్తావన ఎందుకంటే   కోడి కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ తల్లి సావిత్రి తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా జైల్లోనే మగ్గుతున్నాడనీ, అతడిని  తక్షణమే విడుదల చేయాలనీ కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. నాలుగేళ్లుగా తన కుమారుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడనీ, ఈ కేసు విషయంలో న్యాయస్థానం కానీ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కానీ ఎటువంటి విచారణ జరపడం లేదని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం పూర్తిగా వినియోగించుకున్న జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసును పట్టించుకోవడమే మానేశారు. తనపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారు అన్నది తేల్చాలన్న నాటి డిమాండ్ ను పూర్తిగా మర్చిపోయారు.  నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న తన కుమారుడిని విడిపించాలంటూ.. శ్రీనివాస్ తల్లి సావిత్రి సీజేఐకి లేఖ రాయడంతో మళ్లీ ఆ కేసు తెరమీదకు వచ్చి

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.