అధికారంతో పాటు పార్టీ కూడా చేజారుతుందనేనా జగన్ భయం?
Publish Date:Jul 9, 2022
Advertisement
జగనే శాశ్వత అద్యక్షుడా, పార్టీ పై పట్టు పోతుందన్న బైలాస్ ను మార్చుకుని మరీ లోకంలో ఎక్కడా లేని విధంగా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకోవాలన్న నిర్ణయం .వెనుక భయం తప్ప మరో కారణం కనిపించదు. తెలుగుదేశం పార్టీ రెండు ఏళ్ళకోసారి ప్లీనరీ నిర్వహించి ,ప్రజాస్వామ్య పద్దతిలో అద్యక్షుడిని ఎన్నుకుంటుంది. అదే వైసీపీ అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహించుకుంటోది. ఇదీ మన తెలుగుదేశం పార్టీకీ, వైసీపీకీ తేడా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జగన్ పై ధ్వజమెత్తారు. శాశ్వత అధ్యక్షుడు అంటూ జగన్ రాష్ట్రంలో మరేం సమస్య లేనట్లు తనకు తాను కిరీటం పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం నెనుక అధికారంతో పాటు పార్టీ కూడా చేజారిపోతున్నదన్న భయమే కారణమని చంద్రబాబు అభివర్ణించారు. జగన్ కి అధికారం తో పాటు పార్టీ కూడా పోతుందనే భయం పట్టుకుందని చంద్రబాబు నాయుడు అన్నారు. తల్లి తో గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించడం ద్వారా జగన్ తనకు అధికారం తన, పర భేదాలు తెలియని రుజువుచేసుకున్నారని నగరిలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో విమర్శించారు. క్విట్ జగన్ - సేవ్ ఆంధ్రప్రదేశ్" అన్న తెలుగుదేశం పిలుపు రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పిన చంద్రబాబు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కోసం కార్యకర్తలందరూ నూతనోత్తేజంతో, రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు బాదుడే-బాదుడు ప్రచారాన్ని తీసుకెళ్లాలని అన్నారు. ని త్యావసర వస్తువుల ధరలు, మూడుసార్లు ఆర్టీసీ చార్జీల పెంపు, విద్యుత్ ఛార్జీల పెంపు,వంటి వాటితో ప్రజలు జగన్ పాలనపై విసిగి పోయారని చంద్రబాబునాయుడు అన్నారు పార్టీలో గ్రూపిజానికి దూరంగా ఉండాలని కార్యకర్తలకి చెప్పారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పని చేసేవారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. తిరిగి అధికారంలోకి రాగానే అంకితభావంతో పని చేసిన కార్యకర్తలకు న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లో 52 శాతం ఖర్చు చేస్తే ప్రస్తుత జగన్ పాలనలో దానిని 41 శాతానికి తగ్గించిందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ఆదాయమంతా ఎక్కడికి పోతోంది? కేంద్ర గ్రాంట్లు ఎక్కడికి పోతున్నాయి? ఈ ప్రభుత్వం తీసుకున్న లక్షల కోట్ల రూపాయల అప్పులేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సొంత నియోజక వర్గం లో కూడా పరదాలు కట్టుకు తిరిగే పరిస్ధితి వచ్చిందంటే జగన్ పట్ల ప్రజలలో ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్ధం అవుతుందని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం పదివేల పాఠశాలలు మూసివేసింది,ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చా కా 2.50 లక్షల మంది విద్యార్దులు చదువుకు దూరం అయ్యరని కేంద్రం నివేదికే స్పష్టం చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. సంక్షేమం ఒట్టి ప్రచారం మాత్రమేననీ, వాస్తవంలో జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిన ప్రయోజనం శూన్యమనీ విమర్శించారు.
http://www.teluguone.com/news/content/jagan-fear-of-loosing-party-along-with-power-25-139388.html





