జగన్ వర్సెస్ విజయసాయి.. ఇక మాటల యుద్ధమేనా?

Publish Date:Feb 7, 2025

Advertisement

 

అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలో క్యారెక్టర్ అంటూ ఇటీవలే పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయసాయి నుంచీ ఘటు స్పందన వచ్చింది. రాజకీయాలలో ఎవరికైనా క్యారక్టర్ అనేది చాలా అవసరమని విజయసాయి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  దీంతో తన క్యారెక్టర్ పై మాట్టాడిన జగన్ కు క్యారెక్టర్ లేదని చెప్పకనే చెప్పేశారు. వీరిద్దరి మధ్యా సంవాదంపై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. ఇంతకీ ఇద్దరిలో క్యారెక్టర్ లేనిది ఎవరికి? విజయసాయికా? జగన్ కా లేక ఇద్దరికీనా? అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. 

విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే పార్టీకి రాజీనామా చేయలేదు. తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని మాత్రపే పేర్కొన్నారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతోనే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా లేఖను జగన్ కు పంపారు. అప్పుడే విజయసాయి, జగన్ ల మధ్య అగాధం ఏర్పడిందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అదీ కాక చాలా కాలంలో వైసీపీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుండటం కూడా విజయసాయి రాజీనామా నిర్ణయానికి కారణమై ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషించారు. 

వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన విజయసాయి జగన్ కు, ఆయన పార్టీకీ దూరం కావడంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదీ కాక జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2. దీంతో ఇప్పుడు విజయసాయి జగన్ కు దూరం అవ్వడమే కాకుండా ఆయన క్యారెక్టర్ పై కూడా వ్యాఖ్యలు చేయడం పెను సంచలనంగా మారింది. తన రాజీనామా సమయంలో కూడా జగన్ పట్ల చాలా సానుకూలంగా విజయసాయి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కూడా విజయసాయి చెప్పారు. తానిక రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నాననీ, వ్యవసాయమే ఇక తన వ్యాపకమనీ ప్రకటించినా.. విజయసాయి మాటల్లో, చేతల్లో రాజకీయాలు కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తరువాత హైదరాబద్ లోడస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో విజయసాయి భేటీ కావడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డిల మధ్య మాటలయుద్ధం అన్న స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అంతకు మించి సంచలనం సృష్టిస్తున్నాయి. 

విజయసాయి రాజీనామా చేసినా వైసీపీ నుంచి జగన్ సహా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. అదోక విషయం కాదన్నట్లుగానే వ్యవహరించారు. స్పందించక పోవడం ద్వారా విజయసాయిరెడ్డి తమకు పెద్ద ఇంపార్టెంట్ కాదన్న సంకేతం ఇచ్చారు. అయితే గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ జగన్ విజయసాయి రాజీనామాపై స్పందించారు. రాజకీయాలలో క్యారెక్టర్ ముఖ్యం అంటూ వ్యాఖ్యానించి అలా క్యారెక్టర్ లేకుండా పార్టీని వదిలేసిన విజయసాయిరెడ్డి అయినా మరొకరైనా ఒకటే నంటూ వ్యాఖ్యనించారు. దీనిపై విజయసాయి వెంటనే రియాక్ట్ అయ్యారు. నిజమే రాజకీయాలలో క్యారెక్టర్ అనేది ఎవరికైనా ముఖ్యమేనని ట్వీట్ చేశారు. తాను రాజకీయాలలోనే కాదు వ్యక్తిగతంగా కూడా క్యారెక్టర్ ఉన్నవాడినేనని చెప్పుకున్నారు. అందుకే పార్టీకే కాదు, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని పేర్కొన్నారు. 

రెండు వారాల కిందల వైసీపీకి, రాజ్యసభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో జగన్ పై తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఫ్యామిలీతో తనకున్న అనుభందాన్ని చెప్పుకొచ్చారు. తాను తన రాజీనామా విషయం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ కు చెప్పాననీ, ఆయన అనుమతితోనే వైదొలగుతున్నాననీ కూడా ఆ మీడియా సమావేశంలో చెప్పారు. అంతే ఆ తరువాత ఆయన ఇక రాజకీయాల గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. అయితే జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన కొన్ని రోజుల తరువాత విజయసాయి క్యారెక్టర్ పై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆ స్పందన జగన్ తో ఢీ అంటే ఢీ అనడానికి విజయసాయిరెడ్డి రెడీ అయిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోంది. 

వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడ్ని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, భయం అనేది నాలో అసలులేదు కాబట్టే రాజ్యసభ పదవి, పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయవర్గాలలో  పెను సంచలనంగా మారింది. దీనికి జగన్ ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఇరువురి మధ్యా ఈ పరిణామం మాటలయుద్ధానికి దారి తీసే పరిస్థితులున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం వైసీపీ మీదే కాదు, జగన్ ఆస్తుల కేసులపైనా పడుతుందంటున్నారు.  

By
en-us Political News

  
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.