వెన్నుపోటు, అక్రమ అరెస్టులు... దేవరపల్లిలోనూ జగన్ పాత పాటే.!
Publish Date:Aug 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా కాలం విరామం తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇంత కాలం బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అడపాదడపా చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లతో సరిపెట్టేశారు. మధ్యలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో పరామర్శల పేరుతో బయటకు వచ్చినా గత రెండేళ్లుగా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇక ఆయన నెమ్మదిగా బయటకు వస్తున్నారు. తాజాగా బుధవారం (ఆగస్టు 4) పొగాకు రైతులకు మద్దతుగా ఆయన దేవరపల్లి వచ్చారు. వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగుదేశం కూటమిపై విమర్శలు, వెన్నుపోటు, అక్రమ అరెస్టుల వ్యాఖ్యలతో ఆవు కథే మళ్లీ మళ్లీ చెప్పారనిపించేలా ఆయన ప్రసంగం ఉంది. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీగా అభివర్ణించారు. చాలా చాలా ఏళ్లుగా జగన్ విమర్శలు ఇవే. ఇక అక్రమ అరెస్టుల గురించి ఆయన చేసిన విమర్శలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నదనీ, అక్రమకేసులు బనాయిస్తోందని జగన్ విమర్శించారు. అయితే జగన్ విమర్శలలో పస లేదని పరిశీలకులు అంటున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు, తమ్మినేని సీతారాంపై కేసులను ప్రస్తావిస్తూ పరిశీలకులు వాటిలో రాజకీయం ఎక్కడుందనీ, నేరాలకు పాల్పడినా వైసీపీయులు అని చట్టం వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు. అదలా ఉంచితే గత రెండేళ్లుగా జగన్ వారానికో రెండు వారాలకో ఓసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే మాటలు చెబుతున్న సంగతిని ప్రస్తావిస్తూ.. దేవరపల్లిలో జగన్ ప్రసంగం రొటీన్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రసంగాలు, విమర్శల పట్ల జగన్ మద్దతు దారులు కూడా పెదవి విరుస్తున్నారు. YS Jagan Devarapalli Tour, TDP Governmen, t Tobacco Farmers Issue, Jagan Political Comments, APnews, TeluguOne
http://www.teluguone.com/news/content/ys-jagan-devarapalli-tour-39-228110.html




