ఎన్డీఏలోకి జగన్?..మోడీ, షాలతో డీల్ సెట్టవుతుందా?

Publish Date:Oct 6, 2023

Advertisement

మాయ చేసి మతలబు చేసి.. ఏదోకటి చేసి మళ్ళీ అధికారం దక్కించుకోవాలి. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక్క టార్గెట్. ఇందు కోసమే రకరకాల ఎత్తులు వేస్తున్నారు, జిమ్మిక్కులు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ములను ఇప్పటికే బటన్ నొక్కుడు పథకాల ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచి బెడుతున్నా ప్రజలు రాష్ట్ర అభివృద్ధి మాటేమిటని నిలదీస్తున్నారు. రూపాయి ఇచ్చి వంద రూపాయలు వసూలు చేస్తున్న జగన్ రెడ్డి పాలన ఇక మాకు వద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇక రాజకీయంగా కూడా ఎన్ని  ఎత్తులు వేసినా అవేవీ వర్క్ అవుట్ కాలేదు. ఒకవైపు తెలుగుదేశం ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి  మళ్ళీ అధికారం దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. దీనికి తోడు తెలుగుదేశంతో జనసేన కూడా కలవడంతో ఆరు నూరైనా.. నూరు పదహారైనా చంద్రబాబు మరోమారు సీఎం కావడం ఖరారైని తేటతెల్లం అయిపోయింది. దీంతో వైసీపీ ముందుగా తెలుగుదేశం, జనసేన మధ్య చీలిక తేవాలని ప్రయత్నించింది. దీనికి కోసం వైసీపీ నేతలు జనసేనను రెచ్చగొడుతూ అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతోనే ప్రయాణమని ఫిక్సయ్యారు. 

తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో వైసీపీ దింపుడు కళ్ళెం ఆశలతో ఎలాగైనా బీజేపీ మద్దతు తమకు కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల వేళ కేంద్రం అండ దండలు ఉంటే  తెలుగుదేశం,జనసేనపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి ఎన్నికల కార్యాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలన్నది వైఎస్ జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసమే బీజేపీ.. తెలుగుదేశం, జనసేన కూటమితో కలవకుండా, తమతో రహస్య బంధాన్ని కొనసాగేలా చేసుకోవాలని వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీ టూర్ లో జగన్ తనదైన వ్యూహాలతో కేంద్ర పెద్దలను కలుస్తారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకూ కూడా టీడీపీ, జనసేన నేతలు కూడా బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నారన్న భావన ఉండేది. కానీ, చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అంతకు ముందే కేంద్రంపై ఏపీలో అసంతృప్తి ఉండగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది బీజేపీపై ఆగ్రహంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూడా బీజేపీతో కలిసి నడిచే పరిస్థితి లేకుండా పోయింది.

 తాజాగా, జనసేనాని పవన్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అవనిగడ్డ సభలో మాట్లాడిన పవన్ కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ అవినీతి సంగతి కేంద్ర పెద్దలకు తెలియదా అంటూ నేరుగానే ప్రశ్నించారు. ఇక పెడన సభకు రాగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని కూడా చెప్పేశారు. దీంతో ఎన్డీయేతో జనసేన ఇక కటీఫ్ అని మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన బీజేపీకి దూరమైతే వైసీపీ దాన్ని అవకాశంగా మలచుకోవడానికి సిద్ధంగా ఉండగా.. ఇప్పుడు ఆ ప్రయత్నాలే జరుగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనలో అడుగులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కచ్చితంగా వైసీపీ ఎంపీలు బీజేపీకే మద్దతు ఇచ్చేలా జగన్ కేంద్రం పెద్దలకు హామీ ఇవ్వడంతో పాటు ఏపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా బీజేపీ క్యాండిడేట్లను గెలిపించేలా ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

అయితే, ఏపీలో బీజేపీ ఎవరితో కలిసినా వారికి నష్టాలే ఎక్కువ ఉండే అవకాశం ఉందని సర్వేల ఫలితాలు చెప్తుండగా.. వైసీపీ, బీజేపీ పొత్తు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గత నాలుగేళ్ళలో వైసీపీ,బీజేపీ బంధం బహిరంగ రహస్యమే. ఇప్పుడు కూడా అది అలాగే కొనసాగే  చాన్స్ ఉందని భావిస్తున్నారు. అవసరమైతే బీజేపీ కోరినట్లు బీజేపీ క్యాండిడేట్లను వైసీపీ ముసుగులో గెలిపించే హామీలు ఇస్తారని కూడా భావిస్తున్నారు. పైకి మాత్రం సింహం సింగిల్ గా పోటీకి వస్తుందని ప్రకటనలు ఇచ్చుకుంటూనే... లోపల మాత్రం బీజేపీతో దోస్తీ చేస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ చేసుకోవాలని వైసీపీ ఆశపడుతున్నట్లు చెప్తున్నారు. అయితే వైసీపీ యుక్తులు, కుతంత్రాలు ఈ సారి పని చేసే చాన్స్ లేదని అంటున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.