సేంద్రియ వ్యవసాయానికి మళ్లిన శాస్త్రవేత్త ఇన్షా!
Publish Date:Jun 23, 2022
Advertisement
వీలయినంత పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి నలుగురికి ఆదర్శంగా నిలవాలను కునేవారుంటారు. అది ఎంతో హర్షణీయం, అంగీకరించాల్సిన సంగతి. కొందరికి పెద్ద చదువులు చద వాలని వుంటుంది కానీ ఆర్ధిక పరిస్థితులో, సామాజిక పరిస్థితులో అందుకు సహకరించవు. ఇటీవలి కాలంలో ఎంతో ఉన్నతస్థాయిలో వున్నవారూ తిరిగి కుటుంబ వారసత్వ వ్యాపార రంగానికి వచ్చే యడమూ జరుగుతోంది. కానీ కాశ్మీర్‌కి చెందిన ఇన్షా రసూల్ సంగతే వేరు. దక్షిణ కొరియా వర్సిటీలో మాలి క్యూలర్ సిగ్నలింగ్ లో పిహెచ్‌డి చేస్తూండగా ఈ శాస్త్రవేత్త.మనసు హఠాత్తుగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లింది. అంతేకాదు వర్సిటీ చదువుకు 2018లో స్వస్తిపలికి తన గ్రామానికి వచ్చి సేంద్రీయ వ్యవసాయ వ్యాపారంలో స్థిరపడింది. అదేదో సినిమాలో మహేష్ బాబులా నిజంగానే పొలం పనులు చేయడం చాలా సీరియస్‌గా తీసుకుంది. తాను వెంటనే విజయాలు సాధించలేదు. విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ. కొన్నిసార్లు పంట మొల కెత్తలేదు, లేదా ఎరువు పనిచేయదు, కొన్నిసార్లు అతిగా నీటిని పెట్టాను, లేదా విత్తనాన్ని తప్పు సీజన్‌లో నాటాను. ఈ ప్రయోగాలు నా గడువు ఆరు నెలలకు మించి కొనసాగాయి. చివరికి, నేను వ్యవసాయం చేయ డాన్ని ఎంచుకున్నాను. ఈ నిర్ణయం జీవితాన్ని మార్చేసింది అని ఇన్షా అన్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి అయిన ఇన్షా పచ్చదనం, తక్కువ ఉష్ణోగ్రతలతో చాలా చోట్ల నివసించారు. కాశ్మీర్, ఢిల్లీ, బెంగళూరులో నివసించిన తర్వాత ఆమె దక్షిణ కొరియాకు వెళ్లింది, అక్కడ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంది. తన కుటుంబం వ్యవసాయం చేస్తున్నప్పటికీ, తన పిల్లల పాఠశాల కార్యకలాపాల సమయంలో స్ట్రాబెర్రీ ఫారమ్‌ను సందర్శించిన తర్వాత మాత్రమే తనకు ఈ వృత్తిపై ఆసక్తి ఏర్పడిందని ఆమె చెప్పారు. తాజా, రంగురంగుల స్ట్రాబెర్రీలను పెంచడానికి వారు ఉపయోగించిన అద్భుతమైన సాంకేతికతతో నేను ఆశ్చర్యపోయాను. కాశ్మీర్‌లో ఎవరైనా ఇలాగే చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తన భర్తకు చెప్పారు. భూమి ఉన్నప్పుడు మరొకరి కోసం ఎందుకు ఎదురుచూడాలని అతను ఆమెను ఉత్సాహపరిచాడు. అంతే, ఆరు నెలల కఠోరమైన ప్రణాళిక , పరిశోధన తర్వాత వర్సిటీ వదిలివేయాలని నిర్ణయం తీసుకుంది ఇన్షా. తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీలో ప్రచారం చేస్తూ తన పంటలను విక్రయిస్తున్నది. 24 గంటల్లోనే ఎక్కు వ శాతం ఉత్పత్తులు అమ్ముడవు తాయన్నాయిట. ఆమె గత నవంబర్, డిసెంబర్‌లలో దాదాపు 8 లక్షల రూపాయలు సంపాదించారు. ఆమె తన టీమ్ క్రమంగా వ్యాపార పరంగా కూడా అభివృద్ధి సాధిస్తున్నారు. లాభాలనిచ్చే ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, అలాగే బ్లాంచ్డ్ స్వీట్ కార్న్, టమాటోల ద్వారా కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాది పొడవునా విక్రయించగలుగుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇన్షా తన బ్రాండ్ పేరుతో ఇతర రకాల కూరగాయలు, ఊరగాయలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయించడానికి స్థానిక రైతులతో కలిసి పనిచేసింది.
సెంట్రల్ కాశ్మీర్ బడగామ్ జిల్లాకి చెందిన ఇన్షా తన కలల ప్రాజెక్టు ఆరంభ సమయంలో ఆమె వద్ద వున్న దల్లా పూర్వీకుల 3.5 ఎకరాల భూమి. రెండేళ్లు ఎంతో శ్రమించి హోమ్ గ్రీన్స్ సంస్థ నెలకొల్పి లక్షలు ఆర్జిస్తోంది. పూర్వీకులు ఆ భూమిలో అప్పటి వరకూ కుటుంబ పోషణకు పంటలు పండించేవారు, కూర గాయలు కూడా పండించేవారు. తర్వాత పై చదువు మానుకుని వచ్చిన శాస్త్రవేత్త వచ్చి రైతులతో మాట్లాడి విత్తనాలు కొని, నాట్లు వేసి సాగుచేసింది. వ్యవసాయంలో అనుభవానికి ఆమె నెలల పాటు పలు సీజన్లకు తగిన విధంగా పలు రకాల విత్తనాలతో వ్యవసాయం చేసింది. శాస్త్రవేత్తగా కేవలం పంటలు పండించడానికి తగిన పరిశోధనలు చేస్తుంటే సరిపోదు పొలంలోకి దిగి పనిచేయాలని గ్రహంచింది.
http://www.teluguone.com/news/content/scientist-insha-turns-to-organic-agriculture-25-138252.html





