జగన్ మావిగన్ జపం.. బాబు అభివృద్ధి వ్యూహం!

Publish Date:Jul 2, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి దశాబ్ద కాలం దాటినా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఇంకా రాజధాని చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. నిలకడైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాల్సిన రాజధాని అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి  రూటు మార్చారు. నిన్నటి వరకు మూడు రాజధానుల నినాదంతో విశాఖపట్నం చుట్టూ రాజకీయాన్ని తిప్పిన జగన్, ఇప్పుడు మావిగన్ మంత్రం పఠిస్తున్నారు.  

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు. తాజాగా  2029 ఎన్నికలలో వైసీపీ ప్రధాన నినాదం మావిగన్ అని ప్రకటించారు.  అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి, మవిగన్ కోరుకునే వారు   వైసీపీకి ఓటు వేయాలంటూ  సవాల్ విసిరారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న సమయంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం సహా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను గట్టిగా ప్రొజెక్ట్ చేసిన వైసీపీ, ఇప్పుడు హఠాత్తుగా ఆ నినాదాన్ని పక్కన పెట్టి మావిగన్ జపం చేయడంపై రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతోంది. వైసీపీని, ఆ పార్టీ అధినేతను నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

 రాజథాని విషయంలో జగన్ తరచుగా మాట మారుస్తుండటం, ఆయన పార్టీ వైసీపీకే నష్టం చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో  ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కేవలం మూడు రాజధానుల వల్లే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళ్లిన  వైసీపీ కేడర్..  ఇప్పుడు.. తూచ్ మూడు రాజధానులు కాదు.. మావిగన్ అంటూ ప్రజలలోకి ఎలా వెళ్లాలో తెలియక అయోమయానికి గురౌతోంది. రాజథాని విషయంలో ఒక స్థిరమైన   విధానం లేకపోతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు, పరిశ్రమలు ఎలా వస్తాయంటూ జగన్ విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

ఇక మరో వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాధినేత చంద్రబాబు..  అమరావతిని ఏకైక రాజధానిగా విస్పష్టంగా పేర్కొంటూనే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు భారీగా పెట్టుబడులను,  ఐటీ, పారిశ్రామిక ప్రాజెక్టులను వేగంగా తరలిస్తూ జగన్ మావిగన్ మంత్రాన్ని  ప్రజలు ఇసుమంతైనా పట్టించుకోనవసరం లేదని చాటుతోంది. 

విశాఖపట్నం కేంద్రంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టిపై బాబు సర్కార్  ఫోకస్ పెట్టింది. రాజధానిని మార్చకుండానే ఉత్తరాంధ్ర), రాయలసీమ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు  చేతల్లో చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులు  పూర్తై, యువతకు ఉపాధి కల్పిస్తే, వైసీపీ  వాదన పూర్తిగా బలహీనపడుతుంది. తెలుగుదేశం మొదటి నుంచి అమరావతి విషయంలో ఒకే స్టాండ్‌తో    ప్లస్ పాయింట్‌గా మారింది.  2029 ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ తెచ్చిన మావిగన్ నినాదాన్ని ప్రజలు  పట్టించుకునే అవకాశమే ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.