మావిగన్.. పేరు ప్రచారానికే జగన్ పరిమితం.. వ్యూహమేంటో గందరగోళం.!

Publish Date:Jul 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మావిగన్ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ రాజధాని అని ప్రకటించడం రాజకీయాలలో సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది.  అయితే ఎవరూ మెచ్చని, ఎవరికీ నచ్చని మావిగన్ నినాదం ప్రతిపాదన వెనుక జగన్ వ్యూహం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  

మచిలీపట్నంలోని తొలి రెండు అక్షరాలు ఎమ్ఏ,  విజయవాడ లోని తొలి రెండు అక్షరాలు విఐ,  గుంటూరులోని తొలి మూడు అక్షరాలు జియుఎన్ లను తీసుకుని ఈ మూడు నగరాల కలయికే   మావిగన్ అంటున్నారు జగన్.  జగన్ గతంలో  జపించిన మూడు రాజధానుల జపానికి, అప్పటి ఆయన సిద్ధాంతానికి ఇప్పుడు ఆయన చెబుతున్న మావిగన్ కు  పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన చెప్పిన ఆ మూడు ప్రాంతాలూ  వేర్వేరుగా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మూడు నగరాల కలయిక రాజధాని అంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గతంలో తాను చెప్పిన వికేంద్రీకరణకు తిలోదకాలిచ్చేసి.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి  కొత్త ప్లాన్ ను తెరపైకి తెచ్చారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన.. మూడు రాజధానులని గతంలో ఆయన చెప్పిన దాని కంటే గందరగోళంగా, ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ప్రతిపాదిత మావిగన్ లో సచివాలయం ఎక్కడ ఉంటుంది? హైకోర్టు ఎక్కడ నిర్మిస్తారు? అసెంబ్లీ ఎక్కడ?   అన్నదానిపై జగన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అసలా వివరాల జోలికి ఏ మాత్రం పోలేదు. ఈ మూడు ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలు కనుక రాజధానిని చేసేస్తే అమరావతి అభివృద్ధి చేయనవసరంలేదు కదా అన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. 

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. మరి జగన్ అధికారంలోకి వస్తే అమరావతిలో  ఉన్న  ఆ భవనాలనే వినియోగిస్తారా? లేక గతంలోలాగే అమరావతిని నిర్వీర్యం చేస్తారా?  అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ ప్రశ్నలకు పరిశీలకులు భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు. ఇందుకు గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పాడుపెట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారు.  

అందుకే జగన్.. మావిగన్ విషయంలో  తన వ్యూహాన్ని మూడేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటి వరకూ వెల్లడించే అవకాశం ఇసుమంతైనా లేదని అంటున్నారు. ఎందుకంటే.. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని చెబితే.. అమరావతికి ప్రత్యామ్నాయం మావిగన్ అంటూ జగన్ చెప్పిన మాటలు అబద్ధాలు అవుతాయి. అలా కాకుండా, వాటిని వినియోగించం, పాడు పెడతాం, పక్కన పెడతాం అని జగన్ ప్రకటిస్తే..  ప్రజలు ఇప్పటి నుంచే జగన్ ను పక్కన పెట్టేయడం మొదలెడతారు. విఫలమైన మూడు రాజధానుల సిద్ధాంతాన్నే జగన్ పట్టుకు వెళాడుతున్నారన్న అభిప్రాయం ప్రజలలోకి బలంగా వెడుతుంది.  అందుకే.. జగన్ మావిగన్ ఏమిటో, ఆయన వ్యూహం ఏమిటో మరో మూడేళ్ల వరకూ వెళ్లడించకుండా.. మావిగన్ అన్న పేరును ప్రచారంలో ఉంచడానికే పరిమితమౌతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Teluguone, AP Capital Issue, Amaravati vs MAVIGUN, YS Jagan Mohan Reddy

By
en-us Political News

  
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.