జగన్ ఢిల్లీకి అలా వెళ్లారు.. ఇలా వచ్చారు!

Publish Date:Aug 22, 2022

Advertisement

జగన్ హస్తిన పర్యటన అదేదో రియాల్టీ షోలో హోస్ట్ చెప్పినట్లు అలా వెళ్లి, ఇలా వచ్చేసినట్లు ముగిసిపోయింది. మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆఖరికి వైసీపీలో కూడా జగన్ పర్యటన గురించి పెద్దగా చర్చ లేదు. ప్రధాని నివాసంలో జగన్ గడిపింది ఓ అరగంట. అందులో జగన్- మోడీ మధ్య భేటీ ఎంత సేపు జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.

అయితే సీఎంవో ప్రెస్ నోట్ ప్రకారం పోలవరం సహా పలు డిమాండ్లతో జగన్ ప్రధానికి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆ తరువాత లాంఛనంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మధ్యలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మాత్రమే ఉన్నారు. జగన్ అమిత్ షాతో కూడా భేటీ కానున్నారని వైసీపీ శ్రేణులు చెప్పారు. అయితే అమిత్ షా అప్పాయింట్ మెంట్ జగన్ కు లభించలేదని హస్తిన వర్గాల ద్వారా తెలిసింది.  జగన్ మోడీతో చర్చించిన విషయాలేమిటన్నది పక్కన పెడితే ఆయన పోలవరంపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారని మాత్రం సీఎంవో ఒక నోట్ విడుదల చేసింది.

గతంలో పలు మార్లు మోడీతో జగన్ భేటీ అయ్యారు. అలా భేటీ అయిన ప్రతి సారీ... వారిరువురి మధ్యా జరిగిన చర్చ ఏమిటన్నది ఎవరికీ తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. ఇప్పుడూ అంతే సీఎంవో నుంచి విడుదలైన ప్రకటన వినా.. జగన్ మీడియా సమావేశం పెట్టి ఏం మాట్లాడారో వివరించిన సందర్భం లేదు. ఇప్పుడూ అదే జరిగింది. ఇంత హఠాత్తుగా.. సిరికిం జెప్పడు అన్న చందంగా జగన్ హస్తిన ఎందుకు వెళ్లారు? ఎందుకు వచ్చారు? అంటే వైసీపీ సీనియర్లు కూడా చెప్పలేని పరిస్థితి. అయితే పరిశీలకులు మాత్రం కేవలం రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకురావడానికే జగన్ హస్తిన పర్యటన అంటున్నారు.

రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాల సంకేతాల నేపథ్యంలోనే జగన్ హస్తినకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారని చెబుతున్నారు. ఇటీవల అంటే అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మోడీ కొద్ది నిముషాలసేపైనా ఆప్యాయంగా ముచ్చటించడం.. మరో సారి కలుద్దాం అంటూ ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ హడావుడిగా హస్తిన వెళ్లారని చెబుతున్నారు. అలాగే ఢిల్లీ మద్యం స్కాం బయటపడిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఏపీ లింకులు ప్రస్తావించడం కూడా జగన్ హస్తిన పర్యటనకు కారణమని అంటున్నారు.మొత్తం మీద జగన్ హస్తిన పర్యటన ఎవరికీ పట్టకుండా పోయింది.

మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఆఖరికి సొంత పార్టీ వారు కానీ జగన్ హస్తిన పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన హస్తిన వెళ్లడం, రావడం మామూలేగా అన్నట్లు నిర్లింప్తంగా ఉండిపోయారు. రాజకీయంగా లేదా కేసుల పరంగా ఏదైనా కొద్ది పాటి ఒత్తిడి వస్తే జగన్ హస్తిన వెళ్లి వస్తారని పార్టీ శ్రేణులే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సారి అదే జరిగిందని వారు అంటున్నారు.
  జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. మొత్తంగా జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పటిలా ఎవరికీ ఆసక్తి కలిగించలేదు. చివరికి వైసీపీ నేతలు కూడా. ఎందుకంటే.. జగన్ వెళ్తారు.. వస్తారు.. చివరికి లోపల ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ ఒకటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అందుకే ఎవరూ పట్టించుకోవడం లేదు. 

By
en-us Political News

  
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.