షా-జగన్ జోడీ.. జాయింట్ యాక్షన్ ప్లాన్?

Publish Date:Nov 22, 2021

Advertisement

భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావలి.. అయితే, అది మోడీనో అమిత్ షానో అనుకుంటే అయ్యే పని కాదు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాలనే  నమ్ముకున్నా మరో సారి  ఢిల్లీ పీఠం దక్కదు, ఈ నిజం కమల దళం గుర్తించింది. అందుకే, దక్షణాదిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రలలో పట్టు సాధించేందుకు నడుబిగించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వైసీపీ, తెరాసకు ప్రత్యాన్మాయంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్  పార్టీలను పక్కకు నెట్టి అ స్థానాన్ని అక్రమించేందుకు అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారు. అంతే కాదు, ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా  ఖతం చేసేందుకు అక్కడ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ, తెరాసలతో బీజేపే  ‘సుపారీ’ ఎగ్రిమెంట్ చేసుకుందని సమాచారం. 

అదలా, ఉంటే ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం కూడా, బీజేపీ, వైసీపీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగమేనా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి, గత నెల రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గిపు మొదలు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం వరకు, చివరకు సాగు చట్టాల రద్దు నిర్ణయం వరకు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే, కేవలం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కాకుండా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా సిద్డంవుతోందని అర్థమవుతోందని పరిశీలకులు అంటున్నారు. గతంలో చేసిన తప్పులు దిద్దుకుంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలను కమల దళం మొదలు పెట్టిందని  అంటున్నారు. అందుకే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబదించి ఎన్నికలకు ముందే ఏపీలో ఒకలా  తెలంగాణలో మరోలా సెకండ్ ప్లేస్, ప్రధాన ప్రత్యర్ధి రోల్ కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించిందని  విశ్వసనీయ వర్గాల సమాచారం.   

కాగా, నవంబర్ మొదటి వారంలో, తిరుపతిలో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా  ఎలాంటి దాపరికం లేకుండా ఖుల్లం ఖుల్లా జగన్ రెడ్డి’ కి తమ ప్లాన్ వివరించారని, అందుకు మరో మార్గం లేక జగన్ రెడ్డి తలూపారని అంటున్నారు. అమిత్ షా ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఇతరత్రా ఏదన్నా సహాయం కావాలంటే, రాష్ట్రంలో రాజకీయంగా తమకు (బీజేపీ) అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అందులో మొదటిది, మూడు రాజధానులకు మంగళం పాడి ఒకే రాజధానికి ఒప్పు కోవడం అని తేల్చి చెప్పినట్లు సమచారం. అందులో భాగంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రెడిట్’ బీజేపీ ఖాతాలో పడేలా స్కెచ్ సిద్దమైందని అంటున్నారు. నిజానికి, రాజకీయంగా చూస్తే  ముందు నుంచి రాజధాని ఉద్యమానికి అన్నివిద్లా మద్దతు తెలుపుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది  టీడీపీ ఒక్కటే. కాబట్టి, పోరాట విజయం క్రెడిట్ కూడా టీడీపీకే దక్కాలి. కనీ ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో కాకుండా, బీజేపీ ఖాతాలో వేసేందుకు కూడా అమిత్ షా స్కెచ్ సిద్దం చేశారని సమాచాం. అందుకే, రెండు సంవత్సరాలకు పైగా రైతులు ఆందోళన చేస్తున్నా, 22 రోజులుగా మహిళలు మహా పాదయాత్ర చేస్తున్నా ఉలుకు పలుకు లేని, జగన్ ప్రభుత్వం బీజేపీ నాయకులు యాత్రలో పాల్గోనగానే, మూడు రాజధానులను మూట కట్టేసిందని, ఇది బీజేపీ, వైసేపీ జాయింట్ యాక్షన్ కావచ్చని అంటున్నారు. 

అంతే కాకుండా రానున రోజుల్లో బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్’లో బీజేపీ పొలిటికల్ మైలేజిని పెంచే ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీస్కోవచ్చని అంటున్నారు. అందులో సవరించిన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ విక్రయం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం వంటి నిర్ణయాలు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. 

అయితే, బీజేపీ, వైసీపీ జాయింట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు చిత్తశుద్దితో పనిచేస్తున్నారో, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజలను మోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసని, తెలుగు రైతు పోరాట విజయం తెలుగు దేశం పార్టీకే చెందుతుందని, జేఏసీనాయకులు, రైతులు  అంటున్నారు.
 

By
en-us Political News

  
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.