వాంగ్ చుక్ నిరశన.. రోజురోజుకూ పెరుగుతున్న ప్రజామద్దతు.!

Publish Date:Jul 17, 2026

Advertisement

పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది. 

 కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది. 

 ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.  

ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.  

ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.  

 public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.