రామోజీని కలవడం జగన్ కు ప్లస్సా... మైనస్సా?

Publish Date:Sep 26, 2015

Advertisement

జగన్ రామోజీ భేటీ...ప్రైవేట్ మీటింగ్ లా జరిగింది, అందుకే వారిద్దరి భేటీపై ఈనాడు, సాక్షిలో చిన్న ఆర్టికల్ కూడా రాయలేదు, తెలుగు మీడియాలో జగన్-రామోజీ మీటింగ్ పెద్ద వార్త అయితే, ప్రతి చిన్న విషయాన్నీ కవర్ చేసే ఈనాడు, సాక్షిలో మాత్రం ఒక్క ముక్క రాయలేదు, పైగా రామోజీని జగన్ కలవడంపై వైసీపీ పొడిపొడిగా సమాధానం ఇచ్చింది, రామోజీ పెద్దమనిషి కాబట్టి సలహాలు తీసుకునేందుకే కలిశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు చెప్పినా, ఇప్పటికివరకూ తిట్టిన నోటితోనే రామోజీని పెద్దమనిషి అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అసలు పార్టీలో సీనియర్ల మాటే వినడు...అలాంటిది బద్ధవిరోధి అయిన రామోజీ సలహాలు తీసుకుంటాడా అనేవాళ్లూ ఉన్నారు, రామో-ఛీ అన్న నోటితోనే రామో-జీ అనడంలో ఏదో ముఖ్యమైన కారణణమే ఉందంటున్నారు.

రామోజీరావును జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశాడో కచ్చితంగా తెలియదు కానీ...మూడ్రోజులుగా ఆ ఇద్దరి మీటింగ్ పై రచ్చరచ్చ జరుగుతోంది, ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో, దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చెప్పలేం, ఎందుకంటే ఆ భేటీ అలాంటిది?... అయితే రామోజీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు? ఎవరు మెట్టుదిగారు? ఇలాంటివన్నీ పక్కనబెట్టేస్తే అసలు ఈ టింగ్ జగన్ కు ప్లస్సా? మైనస్సా?, రామోజీని తీవ్రంగా వ్యతిరేకించే వైఎస్ అభిమానులైతే జగన్ ఫిల్మ్ సిటీకి వెళ్లడాన్ని జీర్జించుకోలేకపోతున్నారు, మడమ తిప్పను మాట తప్పననే తమ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రామోజీ కాళ్ల దగ్గరకు వెళ్లాడంటూ ఫేస్ బుక్లో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు, అలాగే తెలుగుదేశం వీరాభిమానులు కూడా జగన్ కు రామోజీ అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు

వైఎస్ అభిమానుల ఆవేదనను పక్కనబెడితే జగన్మోహన్ రెడ్డి ఓ మెట్టుదిగి ఫిల్మ్ సిటీకి వెళ్లిమరీ రామోజీని కలవడం వైసీపీకి ఎంతోకొంత మేలే చేస్తుంది, తెలుగుదేశం వీరాభిమానులకు ఇది రుచించకపోయినా, కమ్మ కమ్యూనిటీలో జగన్ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందనేది మాత్రం నిజం. 2014 ఎన్నికల సమయంలో  చంద్రబాబు...తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేత అనే హోదాను పక్కనబెట్టేసి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లడంతోనే కాపు కమ్యూనిటీ అంతా తెలుగుదేశం వైపు తిరిగింది, ఆ భేటీ కాపుల్లో బలంగా ప్రభావం చూపింది,మనోడి దగ్గరికి చంద్రబాబు వచ్చాడు అనే భావన... మెజార్టీ కాపులను టీడీపీ వైపు మళ్లేలా చేసింది, ఇప్పుడు రామోజీని జగన్ కలవడం ద్వారా అలాంటి సంకేతాలే కమ్మ కమ్యూనిటీలోకి వెళ్తాయనేది సత్యం, ఇప్పటివరకూ జగన్ ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాల్లో ఈ మీటింగ్ పాజిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చే అవకాశమైతే ఉంది, దాంతో భవిష్యత్ లో వైసీపీకి మేలు జరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఆవిధంగా రామోజీతో మీటింగ్ జగన్ కు ప్లస్సే కావొచ్చు

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.