ఇస్లామీకరణను పక్కన పెట్టి లాహోర్ లో హిందూ దేవుళ్ల పేర్లు.. పాక్ వ్యూహం ఏంటి?

Publish Date:May 20, 2026

Advertisement

పాకిస్తాన్‌లోని చారిత్రాత్మక నగరమైన లాహోర్  పాత సాంస్కృతిక మూలాలను మళ్లీ వెలికితీస్తోంది. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఇస్లామీకరణ ధోరణిని పక్కనపెట్టి.. దేశ విభజనకు ముందు ఉన్న చారిత్రక హిందూ, సిక్కు, జైన్ గుర్తింపులను పాకిస్థాన్  ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగానే లాహోర్ లోని  పలు ప్రాంతాలలో  వలస పాలన కాలం నాటి  అంటే బ్రిటిష్ కాలం నాటి,  దేశ విభజనకు పూర్వం ఉన్న పాత పేర్లు తిరిగి దర్శనమిస్తున్నాయి.

రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి   పాత పేర్లను ఖరారు చేశారు. ఈ మార్పుల్లో భాగంగా  ఇస్లాంపురా ప్రాంతానికి  కృష్ణానగర్ గా,  బాబ్రీ మసీదు చౌక్ ను  జైన్ మందిర్ చౌక్ గా,  రెహమాన్ గల్లీ ని రామ్ గల్లీ గా మార్చారు.  వీటితో పాటు 'ఫాతిమా జిన్నా రోడ్డును పాత పేరైన  క్వీన్స్ రోడ్డుగా పునరుద్ధరించారు.  

ఈ మార్పుల వెనుక పాకిస్తాన్ అంతర్జాతీయ వ్యూహం దాగి  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాము ఉగ్ర ధోరణులను వీడి, అందరినీ కలుపుకుపోయే సహనశీల, అలాగే..  బహుళ సంస్కృతుల దేశంగా మారుతున్నట్లు ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ సమాజం నుండి దౌత్య, ఆర్థిక  సహాయాన్ని సులభంగా పొందవచ్చని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  

ముఖ్యంగా ఉగ్రవాద నిధుల ఆరోపణల వల్ల పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వేల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్  వంటి అంతర్జాతీయ సంస్థలు మళ్లీ ఆంక్షలు విధించకుండా నివారించడానికి, తాము తీవ్రవాదానికి దూరంగా జరుగుతున్నామనే నమ్మకాన్ని కలిగించేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నమే ఈ పేర్ల మార్పు అంటున్నారు పరిశీలకులు. 

ప్రస్తుతం తీవ్ర  ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్..  మనుగడ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి ) బెయిల్ అవుట్ ప్యాకేజీపైనే పూర్తిగా ఆధారపడింది. ఆర్థిక అంశాలతో పాటు,  ఆయా దేశాల రాజకీయ, సామాజిక వాతావరణాన్ని కూడా ఐఎంఎఫ్ పరిగణనలోకి తీసుకుంటుంది కనుక..  విదేశీ పెట్టుబడిదారులలో,  ఐఎంఎఫ్ ప్రతినిధులలో నమ్మకాన్ని పెంపొందించేందుకు ఈ చారిత్రక పునరుద్ధరణ చర్యలను పాకిస్థాన్ చేపట్టిందని అంటున్నారు. 

ఈ పేర్ల మార్పు ప్రక్రియ 2025లోనే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం షరీఫ్‌ల నేతృత్వంలో ప్రారంభమైంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 బిలియన్ పాకిస్తానీ రూపాయల ప్రాజెక్ట్ అయిన  లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్  లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా దేశ సాంస్కృతిక రాజధానిగా వెలుగొందిన లాహోర్‌కు విభజన కు ముందు నాటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా చారిత్రక,  వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించి, ప్రభుత్వానికి కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవాలని పాక్ యోచిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చారిత్రక ప్రాంతాలకు వాటి పాత పేర్లను అధికారికంగా పునరుద్ధరించే అవకాశం ఉంది.

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.