పశ్చిమ బెంగాల్ తృణమూల్ నేతలపై భౌతిక దాడులు..మిషన్ బీజేపీ అంటే ఇదేనా?

Publish Date:Jun 1, 2026

Advertisement

భారత రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన, విప్లవాత్మకమైన మహిళా నాయకురాలిగా పేరుగాంచిన మమతా బెనర్జీకి స్వరాష్ట్రంలో ఊహించని షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్ వేదికగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్  ఘోర పరాజయాన్ని చవిచూసింది. సొంత గడ్డపై జరిగిన ఈ  పోరులో దీదీ స్వయంగా ఓడిపోవడమే కాకుండా.. ప్రస్తుతం ఆమె పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు బెంగాల్‌లో  ఏకఛత్రాధిపత్యంగా ఏలిన టీఎంసీకి ఇప్పుడు ప్రతికూల గాలి వీస్తోంది. బీజేపీ అక్కడ పట్టు సాధించి అధికారంలోకి రావడంతో తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ తన మార్క్ పాలిటిక్స్‌తో ముందుకు సాగుతుండటంతో టీఎంసీ క్యాడర్ రక్షణ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవలి కాలంలో టీఎంసీ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న దాడులు బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీలో అత్యంత కీలక  యువనేత అభిషేక్ బెనర్జీపై జరిగిన భౌతిక దాడి పార్టీ మద్దతుదారులను పూర్తిగా కోలుకోలేని దెబ్బ తీసింది.  టీఎంసీ  హయాంలో తెర వెనుక ఉండి మొత్తం పరిపాలనను నడిపించారనే ముద్ర ఉన్న అభిషేక్ బెనర్జీపై ఇంత బహిరంగంగా దాడి జరగడం బెంగాల్‌లో మారిన అధికార మార్పిడికి, తారుమారైన బలాబలాలకు నిదర్శనంగా నిలుస్తోంది. బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులను భయపెట్టిన నాయకులే ఇప్పుడు వీధుల్లో దాడులకు గురవుతుండటం బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది.

ఈ ఘోర పరాభవం నుంచి కోలుకోకముందే..  తాజాగా మరో సీనియర్ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై భౌతిక దాడి జరగడం బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిని, తీవ్రమైన రాజకీయ కక్షసాధింపులను సూచిస్తోంది. హుగ్లీ జిల్లాలోని చండీతలా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల అనంతర హింసపై పోలీసులకు వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన కల్యాణ్ బెనర్జీపై  కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దెబ్బల తీవ్రతకు ఆయన ఒక్కసారిగా రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే టీఎంసీకి చెందిన ఇద్దరు టాప్ లీడర్లపై ఇలాంటి దాడులు జరగడం చూస్తుంటే..  పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందనే చర్చ నడుస్తోంది. దీనినే రాజకీయ విశ్లేషకులు 'మిషన్ బీజేపీ'గా అభివర్ణిస్తున్నారు.

గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో విపక్షాలపై, ముఖ్యంగా బీజేపీ నేతలపై విస్తృతంగా దాడులు జరిగాయనే ఆరోపణలు గట్టిగా ఉండేవి. నాటి హింసాత్మక రాజకీయాలు, భౌతిక దాడుల సంస్కృతిని వ్యతిరేకిస్తూనే బీజేపీ అక్కడ సుదీర్ఘ పోరాటం చేసింది. ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడంతో..  ఆ వ్యూహం ఇప్పుడు టీఎంసీ వైపు తిరిగినట్లు కనిపిస్తోంది. గతంలో తాము చేసిన తప్పులకు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు చూపించిన అహంకారం, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే బలహీనతగా మారి వేధిస్తోంది. ప్రతి స్థాయిలోనూ టీఎంసీ క్యాడర్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మమతా బెనర్జీ లాంటి అజేయమైన నాయకురాలికి ఇది రాజకీయంగా అత్యంత క్లిష్ట సమయమని చెప్పవచ్చు. ఈ రాజకీయ సంక్షోభం నుండి ఆమె పార్టీని ఎలా గట్టెక్కిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ కూడా ఇలాంటి ఆహార్యాన్ని ఎంచుకోలేదు.నల్లకొటు ధరించే ఏకైక ముఖ్యమంత్రి విజయ్ అనడంలో సందేహం లేదు. సీఎంలు, ప్రముఖ పొలిటీషియన్లు ధరించే సాధారణ చొక్కాలు, ప్యాంట్లు మొనాటనీ అయిపోయి జనం వాటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పొచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.