జగన్ దృష్టిలో కొడాలి నాని కూరలో కరివేపాకేనా?

Publish Date:Nov 24, 2022

Advertisement

 అధినేత అండ తనకు మెండుగా ఉందనుకున్నారు.. ఆపైన మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రెచ్చిపోయారు.. తనకు ఇక తిరుగే ఉండదనుకున్నారు. అబ్బో.. అధినేత తనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేస్తున్నారో.. అని ఊహించుకుని ఓవర్ యాక్షన్ డోస్ పెంచేశారు.  టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ , ఇతర టీడీపీ నేతల పై  నిత్యం నోటికొచ్చిన మాటలతో హద్దులు దాటి విమర్శలు చేశారు.

చంద్రబాబును తిడితే చాలు తన స్థానం పదిలం అనుకున్న ఆయన ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిన మాజీ మంత్రి కొడాలి నాని. జగన్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొడాలి నాని అమాత్య పదవి పీకేశారు. దాంతో కంగు తిన్న కొడాలిని పల్నాడు ప్రాంతీయ సమన్వయకర్త అనే ముద్ర వేసి కొద్దిరోజులు సంతృప్తి పడమన్నారు. తాజాగా ఆ పదవి నుంచి కూడా పీకేసి నీ స్థాయి ఇదే అని చెప్పకనే చెప్పారు. దీంతో కొడాలి నాని పరిస్థితి ఇప్పుడు కూరలో కరివేపాకులా అయిందని  వైసీపీ శ్రేణులో జోకులేసుకుంటున్నాయి. అచ్చోసిన ఆంబోతులా రెచ్చిపోయిన కొడాలి నానికి తగిన శాస్తే జరిగిందని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

నోరు తెరిస్తే.. బూతులు మాట్లాడే మాజీ మంత్రి కొడాలి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందన్న భావన ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్ష నేతల్లోనూ వ్యక్తమౌతోంది. గతంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి  కోల్పోయిన సందర్భంలో కొన్ని రోజులు తన పశువులపాకలో నులక మంచంపై వెల్లకిలా పడుకుని దిగులుగా కనిపించిన కొడాలి నాని   ఉన్న ఒక్క చిన్న పదవి కూడా చేజారడంతో ఇప్పుడెలా కనిపిస్తారో చూడాలన్న ఆసక్తి వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమౌతోంది. సరే మంత్రి పదవి పోయినప్పుడు కొంతకాలం స్తబ్ధుగా ఉన్న కొడాలి.. మళ్లీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే లీకులు రావడంతో మరోసారి తన బూతుల విశ్వరూపం ప్రదర్శించారు. ఆ తర్వాత కేబినెట్ రీ షఫిల్ విషయాన్ని సీఎం జగన్ పక్కన పెట్టేయడంతో మళ్లీ మౌనంలోకి జారుకున్నారు.

తర్వాత విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మార్చినప్పుడు అధినేత ఆదేశానుసారం కొడాలి నాని కిమ్మనకుండా ఉన్నారు. ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు ప్రశంసించని వారు వర్శిటీ పేరులో ఎన్టీఆర్ తొలగించడంపై ఎందుకు స్పిందిస్తున్నారంటూ తన సహజ బూతుల ధోరణిలో కొడాలి ఆని స్పందించడం గమనార్హం. ఇంకో పక్కన గుడివాడ నియోజకవర్గంలో తనను గెలవనివ్వకూడదని టీడీపీ అధినేత కంకణం కట్టుకుని బలమైన అభ్యర్థిని బరిలో దింపే యత్నాలు చేస్తుండడంతో మళ్లీ రెచ్చిపోయారు. తనపై గుడివాడ బరిలో నేరుగా చంద్రబాబు దిగినా.. నారా లోకేశ్ నిలబడినా.. లేదా కోట్ల రూపాయలు తెచ్చి ఎన్నారైతో ఢీకొట్టాలని చూసినా.. ఓటర్లు తనకే  పట్టం కడతారని కొడాలి నాని గొప్పలు పోయారు.

ఇత తాజాగా వైసీపీ కేబినెట్ లో కమ్మ సామాజికవర్గానికి చోటు లేకుండా చేసిన జగన్ తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి, సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు పై కొడాలి నాని తీవ్రంగా స్పందించడం విశేషం. కేబినెట్ మంత్రి పదవి ఇస్తేనే కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టా? అని ప్రశ్నించారు. చివరికి కొడాలి నాని ఎంతదాకా వెళ్లారంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కదా..! ఆయనది కేబినెట్ ర్యాంకే కదా అని  వ్యాఖ్యానించేంత వరకూ వెళ్లారు.   ప్రతిపక్షనేత పోస్టును కూడా ప్రభుత్వం ఖాతాలో వేసేందుకు కూడా కొడాలి తెగించేశారు.

వైసీపీ అధినేతకు కొడాలి నాని ఎంత గట్టి మద్దతుదారుగా ఉన్నప్పటికీ ఆయన ఒక్కొక్క పదవినీ పీకేస్తూ.. జగన్ నిర్ణయాలు తీసుకోవడం చూస్తే   ఆయన గుడివాడలో  నెగ్గడం  సంగతి దేవుడెరుగు.. అసలు పోటీ చేయడానికి పార్టీ టికెట్టైనా వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలు కలుగుతున్నాయి.  జగన్ ఇప్పటి వరకూ వాడుకుని వదిలేసిన నాయకుల జాబితాలో తాజాగా ఇప్పుడు కొడాలి నాని పేరు కూడా చేరింది. 

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.