మంత్రి కాకాణి ఇరుక్కున్నట్లేనా?.. ఫైల్స్ చోరీ కేసు సీబీఐకి

Publish Date:Nov 24, 2022

Advertisement

ఏపీ మంత్రి కాకాణి గోవర్ధర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయనపై ఉన్న ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ 13న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఓ చోరీ జరిగింది. కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలం రేపింది.

 ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని..  స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే  వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అప్పట్లో ఇచ్చిన అప్పట్లో నివేదికను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణకు స్వీకరించింది. అసలింతకీ  ఏం జరిగిందంటే..  అప్పటి కి ఎమ్మెల్యే అయిన కాకాణి గోవర్థన్  తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. వెంటనే స్పందించిన చంద్రమోహన్ రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్ అని ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలోనే  కాకాణికి జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి  దక్కింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది.  ఈ దొంగతనం కేసులో.. కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు చోరీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించడంతో ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ కేసునే సీబీఐకి అప్పగిస్తూ ఇప్పుడు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా    మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  ఫైల్స్ చోరీ ఘటనపై దర్యాప్తు  సీబీఐకి అప్పగిస్తే కాకాణి ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ అప్పట్లోనే జోరుగా సాగింది.    నెల్లూరు కోర్టులో ఉన్న ఫైల్స్ చోరీ అయ్యాయని ముందుగా ఒప్పంద బెంచ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై అసలా ఫైల్స్ కోర్టు అధీనంలోనే లేవని, అవి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని హైకోర్టుకు నివేదిక సమర్పించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  

గుర్తు తెలియని వ్యక్తులతో బెంచి క్లర్కు నాగేశ్వరరావు కుమ్మక్కై కట్టుకథ అల్లాడని, పత్రాలు చోరీ అయ్యాయని కోర్టును తప్పదారి పట్టించాడని ఆ నివేదికలో జస్టిస్ యామిని పేర్కొన్నారు. అంతే కాకుండా  ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని తన నివేదికలో జస్టిస్ యామిని హైకోర్టుకు విన్నవించారు.  ఆ మేరకే ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.