దర్యాప్తు సంస్థలపైనే ఎదురు కేసులు.. తెలుగు రాష్ట్రాలలో కొత్త ధోరణి

Publish Date:Nov 24, 2022

Advertisement

దర్యాప్తు సంస్థలంటే ఇక రాజకీయ నాయకులకు భయం పోయిందా? వాటి దూకుడుకు అడ్డు కట్ట వేసే కిటుకు వారు కనిపెట్టేశారా? అంటే ప్రస్తత పరిస్థితులను గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది. దర్యాప్తు సంస్థల దూకుడును అరికట్టడానికి ఏం చేయాలో మాత్రం ముందుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ దారి చూపారని చెప్పాలి.  ఆ తరువాత దానినే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అవుతున్నారు. రాజకీయ అవసరాలకు, ప్రయోజనాలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆ ఆరోపణలను బలపరిచేవిగానే ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే.. రాష్ట్రంలో  కేంద్రంలోని బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని తెరాస సర్కార్ మధ్య యుద్ధం జరుగుతున్నదా అన్నట్లుగానే ఉంది. కేంద్రం తెరాస నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తెరాస కేంద్రం నేతలు లక్ష్యంగా ఏకంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మొత్తం మీద రాజకీయ పంజరంలో దర్యాప్తు సంస్థలు బందీ అయిపోయాన్న భావన మాత్రం సామాన్య జనంలో బలంగా ఏర్పడిందనడంలో సందేహం లేదు. ఇక దర్యాప్తు సంస్థల తనిఖీలు, దాడులు, సోదాలను ఎదురుదాడితోనే ఎదుర్కొవాలన్న నిర్ణయానికి రాజకీయ పార్టీలు వచ్చేశాయని చెప్పక తప్పదు.

దర్యాప్తు సంస్థల అధికారులపై ఎదురు కేసులు పెట్టడం ద్వారా దర్యాప్తును నీరుగార్చడం, లేదా జాప్యం అయ్యేలా చూడటం అన్న ఎత్తుగడను రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి. ఈ ధోరణి వైసీపీ సర్కార్ పాలనలోని ఏపీలో తొలుత మొదలైందని చెప్పాలి. వైఎస్ వివేకా హత్య కేసు ఏపీ సర్కార్ కు ఇష్టం లేకపోయినా సర్కార్ ప్రమేయం లేకుండా నేరుగా హై కోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టీ పట్టడంతోనే తీగలు లాగేసింది.. డొంకలు వరకూ దర్యాప్తు చేరిపోయింది. వివేకా హత్య వెనుక సూత్రధారులు ఇక వెలుగులోనికి వచ్చేసినట్లు అన్న పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మొదలైంది సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టడమనే ప్రక్రియ. అలాగే దాడుల ప్రక్రియ. దీంతో కొలిక్కి వచ్చిందనుకున్న దర్యాప్తు పురోగతి మందగించింది.

దీంతో స్వయంగా సీబీఐయే హైకోర్టుకు తమపై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదనీ చెప్పుకుంది. చివరకు వివేకా హత్య కేసు విచారణ  ఏపీ బయట జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టుకు కూడా విన్నవించుకుంది.ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడును సరిగ్గా అలాగే అడ్డుకోవాలని కేసీఆర్ తమ పార్టీ నేతలకు సూచించారు. దర్యాప్తు సంస్థలపై తిరగబడండని ఏకంగా పిలుపు నిచ్చారు. మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ చెప్పింది అమలులో పెట్టేశారు కూడా. తన నివాసాలు కార్యాలయాలు, అలాగే తన బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాలను రాజకీయ కక్ష పూరితమైనవేనని ఆరోపించడమే కాకుండా తన కుమారుడిపై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారంటూ ఆరోపణలకు గుప్పించారు.

ఆస్పత్రి పాలైన కుమారుడిని చూడనీయడం లేదంటూ తన ఆస్పత్రి ముందే ధర్నాకు దిగారు. అంతే కాదు తన కుమారుడిపై ఒత్తిడి తీసుకువచ్చి ఐటీ అధికారులు కొన్ని కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై ఐటీ అధికారపై కేసు నమోదైంది. మొత్తం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ క్రీడలో పావులుగా మారిపోయి దిక్కు తోచని పరిస్థితుల్లో పడిన పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తోంది.  దీంతో దర్యాప్తు సంస్థలు సజావుగా తమ పని కొనసాగించే పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాలలో కనిపించడం లేదు. ఇందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.