ఇరాన్ దెబ్బకు ప్రపంచ దేశాలకు చమురు సెగ

Publish Date:Mar 13, 2026

Advertisement

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం మొత్తం ప్రపంచంపై పడుతోంది. ముఖ్యంగా  ప్రపంచ చమురు మార్కెట్‌పై తీవ్రాతితీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది.  మరీ ముఖ్యంగా చమురు ధరలు అంతర్జాతీయ విఫణిలో భగ్గుమంటున్నాయి.   ఇరాన్   చర్యల కారణంగా ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం అయిన హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో  ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ధరలు పెరగడం మాత్రమే కాకుండా అసలు సరఫరాయే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. 

హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే. గల్ఫ్ ప్రాంతంలోని సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురు, సహజవాయువు ప్రధానంగా ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచంలో వినియోగించే మొత్తం చమురులో దాదాపు 20శాతం సరఫరా ఈ  మార్గం ద్వారా జరుగుతుంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్గం దాదాపు మూసుకుపోయింది.   ఇరాన్ తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రకటించిన యుద్ధానికి ప్రతీకారంగా  
హోర్ముజ్ జలసంధి మార్గంలో తన నావికాదళ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో ప్రయాణించేందుకు అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో   షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను తాత్కాలికంగా నిలిపివేశాయి. 

ఈ కారణంగా  ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు  ఆకాశానికి అంటాయి. ఈ సరఫరా అంతరాయం ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరగడం అనివార్యం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.

 హోర్ముజ్ జలసంధి వద్ద భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా, యూరోపియన్ దేశాలు   చర్యలు చేపడుతున్నాయి. సముద్ర మార్గం సురక్షితంగా ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సైతం సాగుతున్నాయి.  అలాగే చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు  గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. అయినప్పటికీ హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు కుదుటపడకపోతే మాత్రం పరిస్థితి అత్యంత భయానకంగా, దయనీయంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాలో అంతరాయం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ ఆర్థిక సంక్షోభంలో కూరుకునేలా చేయడం తథ్యమని చెబుతున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్‌ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
​చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.