ఉక్రెయిన్ బుల్లెట్ తో ఇరాన్ దాడులకు కళ్లెం.. గల్ఫ్ దేశాల కొత్త వ్యూహాలు

Publish Date:Mar 13, 2026

Advertisement

మిడిల్ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమతమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి.  ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ అభివృద్ధి చేసిన  బుల్లెట్ డ్రోన్లు లేదా ఇంటర్‌సెప్టర్ డ్రోన్లపై దృష్టి సారించాయి.

ఇటీవలి కాలంలో డ్రోన్ యుద్ధం ప్రపంచ భద్రతా వ్యవస్థల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో  రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ తక్కువ ఖర్చుతో  అదే సమయంలో అత్యంత వేగంగా స్పందించే డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగించింది.  శత్రు డ్రోన్లను గాల్లోనే గుర్తించి అడ్డుకునే ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు యుద్ధభూమిలో సమర్థవంతంగా పని చేశాయి కూడా.  

ఇప్పుడు   గల్ఫ్ దేశాలు తమ రక్షణ వ్యవస్థల్లో వీటిని ఉపయోగించేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులను ముందుగానే గుర్తించి, గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఈ బుల్లెట్ డ్రోన్లు శత్రు డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని వేగంగా దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో  ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా డ్రోన్లతో ముందుకు వచ్చే అవకాశాలున్నాయని గల్ఫ్ దేశాలు అంచనా వేస్తున్నాయి.

 ఈ నేపథ్యంలోనే ఆధునిక డ్రోన్ నిరోధక వ్యవస్థలవైపు దృష్టి సారించాయి.  డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంప్రదాయ రక్షణ వ్యవస్థలతో పాటు ఇలాంటి ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల భద్రతలో  ఈ సాంకేతికత కీలకంగా మారే అవకాశం ఉంది.  

By
en-us Political News

  
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.