ఇరాన్ తాత్కాలిక సుప్రీం అరాఫీ మృతి!
Publish Date:Mar 2, 2026
Advertisement
పశ్చిమాసియాలో ఉద్రికత్తలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌తో ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు ప్రారం భించింది. తాజాగా ఇరాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. తాత్కాలిక సుప్రీం లీడర్ అలీ రెజా అరాఫీ మరణించారు. అరాఫీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇరాన్ స్టేట్ మీడియా ఈ వార్తలపై స్పందించలేదు. తాత్కాలిక సుప్రీం లీడర్ మరణించాడన్న వార్తలు సోషల్ మీడియా వైరల్‌గా మారటంతో టెహ్రాన్‌లో అలజడి మొదలైంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా వైమానిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ తదితర దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు చేసింది. కాగా.. సోమవారం (మార్చి 2) శత్రు దేశానికి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది. కువైట్ గగనతలంలో ఎగురుతున్న ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను తమ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇరాన్ విడుదల చేసింది . అయితే ఈ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్‌దా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పైలెట్లు ఇద్దరూ పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/iran-interim-supreme-leader-arafi-died-36-214894.html





