బీఆర్ఎస్ కమిటీలు రద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం

Publish Date:Apr 28, 2026

Advertisement

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి పూర్వవైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం  ఉన్న జిల్లా, మండల,  గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.  

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. పరిమిత సంఖ్యలో ముఖ్య నేతల మధ్య జరిగిన ఈ సమావేశంలో ఆయన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. పార్టీలో కొత్త రక్తాన్ని నింపాల్సిన అవసరం ఉందనీ..  అందుకే పాత కమిటీలను పక్కనపెట్టి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఇకపై పార్టీలో ఎవరిని నియమించాలి, ఏ స్థాయి నేతలకు ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయం పూర్తిగా కేటీఆర్ చూసుకుంటారని పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలనీ.. తద్వారా   పార్టీ పునాదులను మరింత పటిష్టం చేయవచ్చనీ అన్నారు. ముఖ్యంగా యువతకు పార్టీలో పెద్దపీట వేయాలని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని  ఈ సందర్భంగా కేసీఆర్  కేటీఆర్‌ ను ఆదేశించారు. 

కేటీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికయ్యే నాయకులకు శిక్షణ కార్యక్రమాలు  నిర్వహించాలని కూడా కేసీఆర్ చెప్పారు.  పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యకర్తలను సిద్ధం చేసే బాధ్యతను కూడా కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా బలంగా పోరాడాలని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.  కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీలో ఇకపై కేటీఆర్ మార్కు స్పష్టంగా కనిపించనుంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.  

By
en-us Political News

  
హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
పటియాలాలోని శంభు-అంబాలా మార్గంలో రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. గూడ్స్ రైళ్లు ఎక్కువగా ప్రయాణించే ఈ మార్గంలో పేలుడు ధాటికి రైల్వే పట్టాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండిపోతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
షరతులకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అణు చర్చలను వాయిదా వేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నదే తన ప్రధాన లక్ష్యమని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అణు చర్చలను పక్కన పెట్టి చేసే ఏ ఒప్పందమైనా నిష్ప్రయోజనమని ట్రంప్ అంటున్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ.. క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నిందితులు బాధితురాలి విద్యా ధృవపత్రాలను మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని, వాటిని మలేగావ్‌లోని ఒక బృందానికి అందించేందుకు ప్లాన్ చేశారనీ, నిదా ఖాన్ బాధితురాలికి ఇస్లామిక్ సాంప్రదాయాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆమె ఫోన్‌లో మతపరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసిందని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.
శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరుకు పేసర్లు హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆది నుంచే ఢిల్లీ బ్యాటర్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. హేజిల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి స్వింగ్ ధాటికి ఢిల్లీ పవర్‌ప్లే ముగియకముందే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక దశలో 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు దిశగా పయనించింది.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.