దర్యాప్తు సంస్థలా.. కేంద్రం చేతిలో కీలుబొమ్మలా!

Publish Date:Jun 14, 2022

Advertisement

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు వివాదాస్పదంగా మారింది. ఏలిన వారి జేబు సంస్థల్లా వాటి పని తీరు ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల పని తీరుపై ఆరోపణలు ఉన్నప్పటికీ మోడీ హయంలో మాత్రం వాటి ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా రాజకీయ ప్రత్యర్థులను ఈ విధంగా వేధించిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, వారిని రాజకీయంగా క్రియాశీలంగా ఉండకుండా చేయడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని రాజకీయ విమర్శలని కొట్టి పారేయడానికి వీలులేని విధంగా అవి వ్యవహరిస్తున్న తీరు ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ విమర్శలకు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కొందరు ఇస్తున్న సమాధానాలు కూడా ఉద్దేశ పూర్వకంగానే మోడీ సర్కార్ రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.  

  యూపీఏ హయాంలో కూడా   ప్రత్యర్ధులను వేధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని బీజేపీ నాయకులు, కొందరు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు..అప్పుడు వారు చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు బదులు తీర్చుకుంటున్నామన్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద మోడీ సర్కార్ రాజకీయ లెక్కలు సరి చేయడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటున్నదని.. అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారని వారి మాటలే రుజువుచేస్తున్నాయి. అయితే బీజేపీకి ప్రజలు పట్టం కట్టింది రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునే అవకాశం ఇవ్వడానికి కాదు.  కాంగ్రెస్ హయాంలో జరిగిన అవకతవకలు, తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ప్రజా రంజక పాలన అందిస్తామన్న  విశ్వాసంతో. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం అధికార పార్టీ.. వారు అప్పుడు చేశారు కనుక ఇప్పుడు మేం చేస్తాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  గవర్నర్ల నియామకం దగ్గర నుంచి ప్రత్యర్ధులపై కేసుల బనాయింపు వరకూ అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ విధానాలనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అనుసరిస్తోంది.  యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థలు అప్పటి అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతలనూ విచారించాయి. ఆరోపణలపై ఆధారాలున్నాయని తమ విచారణలో బయట పడితే వారిని అరెస్టు చేయడానికీ వెనుకాడ లేదు.

యూపీఏ హయాంలో షాని గుజరాత్‌లో బూటకపు ఎన్‌ కౌంటర్ల కేసుల విచారణ సమయంలో ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షాను అరెస్టు చేసిన సంగతి విదితమే. అదే యూపీఏ హయాంలో స్పెక్ట్రమ్‌, బొగ్గుగనుల కుంభ కోణాలపైనా సీబీఐ దర్యాప్తు చేసింది. ఆ సందర్భంగా  యూపీఏ భాగస్వామ్య పార్టీల నేతలనూ విచారించింది. మధుకోడా వంటి వారిని అరెస్టు చేసింది.  యూపీఏలో కీలక  భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకె సీనియర్‌ నాయకుడు ఎ రాజా, పార్టీ ఎంపీ కనిమొళి సైతం అరెస్టయ్యారు. అయితే మోడీ హయాంలో దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అవి కేవలం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై మాత్రమే దాడులు చేస్తున్నాయి, వేధిస్తున్నాయి అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ , ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సమన్లు పంపడం, రాహుల్ గాంధీని గత రెండు రోజులుగా సుదీర్ఘంగా విచారించడం రాజకీయ కక్షగానే కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరిశీలకులు సైతం అదే అంటున్నారు.  ఇక రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న తీరు.. గతానికి భిన్నంగా విచారణ సమయంలో లంచ్ బ్రేక్ ఇచ్చి ఆయన బయటకు వెళ్లి వచ్చేందుకు అవకాశం ఇవ్వడం, భారీ బందోబస్తు మధ్య ఈడీ వాహనంలోనే విచారణకు తీసుకు వెళ్లడం గమనిస్తుంటే ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ అనుమానంతోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా హస్తిన సహా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగానే ఆ సంస్థల తీరు ఉంటున్నదన్నది మాత్రం వాస్తవం.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.