రేవంత్ చొరవ.. కేసీఆర్ వ్యతిరేక శక్తుల ఐక్యతారాగం.. షర్మిలకూ ఆహ్వానం

Publish Date:Jun 14, 2022

Advertisement

రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు.. అనూహ్యం అన్ప మాటకే తావుండదు. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు అవుతారు.. నేటి శత్రువులు రేపు ఆప్త మిత్రులు అవుతారు. నిన్నటి దాకా తిట్టి పోసుకున్న పార్టీలు నేడు పరస్పరం ప్రశంసలు, పొగడ్తలతో ఆలింగనం చేసుకుంటాయి.  తెలంగాణలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తున్నది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై గతంలో విమర్శలతో విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు షర్మిల పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకూ తెలంగాణలో షర్మిల పార్టీని కానీ, ఆమె పాదయాత్రను కానీ పట్టించుకున్న పార్టీ కానీ నేత కానీ లేరు. ఆమె మానాన ఆమె కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ నిరశనలు, పాదయాత్రతో రాష్ట్రంలో ఒంటరి పయనం చేస్తున్నారు. షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా అభివర్ణిస్తూ ఎద్దేవా చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిలను కాంగ్రెస్ నిర్వహిస్తున్న అఖిల పక్ష భేటీకి ఆహ్వానించారు. రాజకీయ వర్గాలలో ఈ పరిణామం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రారంభించిన సమయంలో రేవంత్ ఆ పార్టీని కేసీఆర్ స్పాన్సర్డ్ పార్టీగా అభివర్ణించారు. ఆ తరువాత కూడా షర్మిల పార్టీని స్వచ్ఛంద సంస్థగా పేర్కొంటూ సెటైర్లు వేశారు. ఆమె పాదయాత్రలను, టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలను పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ టీపీని రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో చీలిక కోసం టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ చేత, టీఆర్ఎస్ వలన ఆవిర్భవించిన పార్టీగానే పరిగణించారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా షర్మిల పార్టీని గుర్తించడమే కాదు, కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ లో బుధవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘బచావో హైదరాబాద్’ పేర బుధవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ తెలుగుదేశం, టీజేఎస్, వామపక్ష పార్టీలు, బీఎస్పీ, జనసేన, ఆప్, లోక్ సత్తా ప్రతినిథులు, మహిళా సంఘాల ప్రతినిథులు, మేధావులు హాజరు కానున్నారు.

ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ షర్మిలను ఆహ్వానించారు. మంగళవారం నిరుద్యోగ దీక్షలో ఉండగా రేవంత్ ఆహ్వానం ఆమెకు చేరింది. దీంతో రెండో ఆలోచన లేకుండా ఆమె ఆ ఆహ్వానాన్ని మన్నించారు. ఖమ్మం జిల్లాలో సాగుతున్న పాదయాత్రకు ఒక రోజు విరామం ఇచ్చి మరీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాలలో తొలి సారిగా షర్మిలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన తొలి పిలుపు ఇది.  ఇప్పటి వరకూ టీఆర్ఎస్ సర్కార్ పై ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒక విధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు ఈ సమావేశాం ఆరంభం కానుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నగరంలో పెచ్చరిల్లుతున్న డ్రగ్స్, జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ గ్యాంగ్ రేప్, క్షీణిస్తున్న శాంతి భద్రతలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.