ధనుష్ మామూలోడు కాదుగా!.. విడాకుల వెనుక ఇంత కథ ఉందా!!
Publish Date:Jan 20, 2022
Advertisement
ధనుష్-ఐశ్వర్య జంట విడిపోయింది. 20+కే పెళ్లి చేసుకొని.. 17 ఏళ్లు కాపురం చేశాక.. రజనీకాంత్ కూతురును ధనుష్ కాదనుకోవడం ఒకింత షాకింగ్ న్యూసే. సెలిబ్రెటీ కపుల్స్ బ్రేకప్ చెబితే.. దాని వెనుక రీజన్స్ ఏంటో అంత ఈజీగా బయటకు రావు. గాసిప్స్, రూమర్సే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ, ధనుష్-ఐశ్వర్యల విషయంలో కొంత నమ్మదగిన న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే... ధనుష్-ఐశ్వర్యల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని అంటున్నారు. గత ఏడాదిగా వారు కలిసి ఉండట్లేదని తెలుస్తోంది. దివంగత నటుడు వివేక్‌కు చెందిన ఇంట్లో ధనుష్ ఉంటున్నాడు. పండగల సమయాల్లో మాత్రం మామ రజనీకాంత్ ఇంటికి వచ్చే వాడని అంటున్నారు. ఇక ధనుష్‌పై ఉన్నన్ని రూమర్స్ మరెవరి మీదా ఉండవేమో. అమలాపాల్‌తో ఎఫైర్ కోలీవుడ్ మొత్తానికి తెలుసంటారు. అప్పట్లో శృతిహాసన్‌తో చట్టాపట్టాలేసుకొని తిరిగారని చెబుతారు. ఇక, ఇటీవల నాగ చైతన్య- సమంత జంట విడిపోవడానికీ ధనుషే కారణం అని అంటున్నారు. కొంతకాలం కీర్తి సురేశ్ వెంట పడ్డారట ధనుష్. అతని టార్చర్ భరించలేక.. 'అన్నాత్తే' (పెద్దన్న) షూటింగ్ సమయంలో.. రజనీకాంత్‌కు ధనుష్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసిందట కీర్తి సురేశ్. అవసరమైతే మీడియా ముందు మేటర్ అంతా చెప్పేస్తానని చెప్పిందట. అయితే, కీర్తి తండ్రి సురేశ్, రజనీకాంత్‌ల మధ్య సత్సంబంధాలు ఉండటంతో ఆ మేటర్‌ను సైలెంట్‌గా క్లోజ్ చేశారని అంటారు. ఎఫైర్లే కాదు.. ఫ్యామిలీ గొడవలూ తక్కువేమీ లేవట. రజనీకాంత్ రెండో కూతురు ఐశ్వర్య చెల్లెలైన సౌందర్య అప్పట్లో భారీ బడ్జెట్‌తో 'సుల్తాన్' అనే యానిమేషన్ మూవీ తీసి.. ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఆ కష్టాల నుంచి బయటపడేందుకు కొన్ని ఉమ్మడి ఆస్తులు అమ్మేశారట. ఆ పని తనకు తెలీకుండా చేసినందుకు.. ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక, అత్త లలిత (రజనీకాంత్ వైఫ్) తీరు ధనుష్‌కు అసలేమాత్రం నచ్చకపోయేదట. ఇంట్లో తనకసలు మర్యాదే ఇవ్వరని.. తనను ఓ వస్తువుగా చూస్తోందని.. తనపై అరుస్తుంటుందని.. సన్నిహితులతో పలుమార్లు గోడు వెల్లబోసుకున్నాడట ధనుష్. అత్త లలిత మీద కోపంతోనే.. పోయెస్ గార్డెన్‌లో 150 కోట్లతో.. పెద్ద మాన్షన్ కట్టిస్తున్నాడు కూడా. ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్న ధనుష్.. ఐశ్వర్యతో తెగదెంపులు చేసుకున్నాడని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/inside-story-behind-dhanush-and-aishwarya-breakup-39-130472.html





