Publish Date:Jan 20, 2022
అతనో బిగ్ బిజినెస్ మేన్. బడా కాంట్రాక్టర్. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంటాడు. పేరు నిరంజన్ కుమార్ జైన్. ఉండేది హైదరాబాద్‌లోనే. ఇతగాడి ఆస్థి ఇంచుమించి వెయ్యి కోట్లు ఉంటుంది. బిజినెస్ సర్కిల్స్‌లో, పార్టీల్లో డ్రగ్స్ అలవాటు అయింది. ఆ తర్వాత వాటికి బానిసయ్యాడు. అలా.. అప్పుడప్పుడూ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకుంటూ వస్తున్నాడు. ఫేమస్ డ్రగ్ పెడ్లర్ టోనీ నుంచి దాదాపు 30సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశాడు. లేటెస్ట్‌గా ఆ టోనీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ వ్యాపారవేత్త నిరంజన్ కుమార్ జైన్ పేరు సైతం బయటకు వచ్చింది. అతన్నీ అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.
నిరంజన్ కుమార్ జైన్ ఒక్కడే కాదు.. అలాంటి సంపన్నులు ఇంకా చాలామందే డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. టోనీతో లావాదేవీలు నడిపిన 13మంది జాబితా ఖాకీలకు చిక్కింది. అందులో 9మందిని అరెస్ట్ చేశారు. శాశ్వత్ జైన్ (కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్), యగ్యానంద్ (స్పైసెస్ బిజినెస్), సూర్య సుమంత్ రెడ్డి, బండి బార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్, ప్రైవేట్ జాబ్ చేసే అల్గాని శ్రీకాంత్, ఆఫీస్ బాయ్ బాడి సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఆర్థికంగా బాగా సెటిల్ అయినవారే కావడం విశేషం. అంత సంపాదించి.. మత్తు పదార్థాలకు బానిసై.. ఇప్పుడిలా కటకటాల పాలు కావడం దారుణం. వెయ్యి కోట్ల ఆస్థి ఉన్నా ఏం లాభం? ఇప్పుడు జైల్లో చిప్ప కూడు తినాల్సిన దుస్థితి. సొసైటీలో ఉన్న పరువంతా పోయి.. డ్రగ్గిస్ట్ అనే ముద్ర.
ఇక, హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా? అనే ప్రశ్నకు.. ఇకపై వాళ్లకు మినహాయింపు ఉండదన్నారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. నగరంలో డ్రగ్స్ వాడకమనేది ఇంటింటి సమస్యగా మారుతోందన్నారు. డ్రగ్స్ వాడే వాళ్లను కట్టడి చేయనంత కాలం.. దీన్ని అరికట్టలేమని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం, ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-cp-cv-anand-on-drugs-case-39-130467.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.