ఇండియన్ సైంటిస్టులు... తెలుగు తీరంలో... 'సెంచరీ' కొడతారా?
Publish Date:Feb 14, 2017
Advertisement
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ... ఈ పేరు మన దేశంలోని ఒక సంస్థది మాత్రమే కాదు! నూరు కోట్ల భారతీయుల గర్వకారణం! స్థాపించినప్పటి నుంచీ ఇస్రో సంధించిన రాకెట్ ఏదీ గగనంలోకి విజయవంతంగా దూసుకుపోకుండా వున్నది లేదు. ఒకటి రెండు వైఫల్యాలే తప్ప ప్రపంచంలో ఇంత అద్బుత విజయ పరంపర మరే పరిశోధనా సంస్థ ఇప్పటి వరకూ సాధించలేదు. ఇక ఇప్పుడైతే అమెరికా, రష్యాల అంతరి పరిశోధనా శాస్త్రవేత్తలకి కూడా విస్మయం కలిగించే సైంటిఫిక్ ఫీట్ చేయబోతున్నారు ఇండియన్ జీనియస్ లు!
ఒకటి రెండు కాదు.. ఏకంగా వందకు మించి ఉపగ్రహాల్ని ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో వారు! అంటే ఇండియన్ సైంటిస్టులు సాటిలైట్స్ సెంచరీ కొట్టనున్నారన్నమాట! ఇస్రో ఫిబ్రవరీ 15, 2017న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని భూమికి 500కిలో మీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టనుంది! 104 సాటిలైట్స్ లో కేవలం 3 మాత్రమే మన దేశానివి! 88 అమెరికాకు చెందినవి! మిగతావి ఇజ్రాయిల్, ఖజక్ స్తాన్, నెదర్లాండ్స్, యూఏఈ లాంటి దేశాలవి!
ఒకప్పుడు టెక్నాలజీ కోసం మనమెంతో ఆధారపడ్డ రష్యా, అమెరికాలకే ఈ రోజు మనం ఉపగ్రహాల్ని ఆకాశా వీధిలో అలంకరించి పెడుతుండటం చాలా పెద్ద విజయం. ఇంత గొప్పగా అంతరిక్ష విజయాలు మరే దేశం సాధించలేదు గత యాభై ఏళ్లలో. ఇజ్రాయిల్, చైనా లాంటి దేశాలు రేసులో వున్నా మన ఇస్రో అంత చౌకగా, ప్రతిభవంతంగా ప్రయగాలు చేయటం, అవ్వి విజయవంతం కావటం మరెక్కడా లేదు!
ఇస్రో చేస్తోన్న 104 ఉపగ్రహాల సాహసం విజయవంతం అయితే ప్రపంచంలోనే ఇన్ని సాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేసిన దేశం మనదే అవుతుంది! అమెరికా 29, రష్యా 37 సాటిలైట్స్ లాంచ్ చేయగలిగాయి. గత సంవత్సరం ఇస్రోనే 20 ఉప గ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టి సత్తా చాటింది! ఇప్పటి వరకూ ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ల సాయంతో 39సార్లు ప్రయోగాలు చేసింది. అందులో 37సార్లు మనం విజయవంతం అయ్యాం. ఒకసారి పూర్తిగా విఫలం కాగా మరొకసారి పాక్షిక విజయం మాత్రమే దక్కింది. అంటే, ఇస్రో చేసిన పీఎస్ఎల్వీ లాంచింగ్స్ 97శాతం సక్సెస్ అయ్యాయన్నమాట!
పీఎస్ఎల్వీ సాయంతోనే మన శాస్త్రవేత్తలు చంద్రయాన్, మంగళ్ యాన్ ప్రయోగాలు కూడా చారిత్రకంగా విజయవంతం చేశారు! బుధవారం మన శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న వంద ఉపగ్రహాలు కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవాలని కోరుకుందాం!
ఈ 104 ఉపగ్రహాల ప్రయోగం ఘన విజయం సాధిస్తే భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త బిజినెస్ మ్యాన్ అవుతుంది! ఆవును, ఇంతకాలం మనం మన కోసం పూర్తిగా ఖర్చు భరించుకుని ప్రయోగాలు చేశాం. ఇక మీద దేశదేశాల ఉపగ్రహాలు లాంచ్ చేస్తూ వాటి నుంచి విదేవీ మారక ద్రవ్యాన్ని, ద్వైపాక్షిక బంధాల్ని సంపాదించుకుంటూ ముందుకు పోవచ్చు! అంటే, మన ఉపగ్రహాలు ఇంచుమించూ ఫ్రీగా లాంచ్ చేసుకోవచ్చన్నమాట! ఇప్పుడు ప్రయోగిస్తున్న 104 సాటిలైట్స్ లో మనవి 3. వాటి లాంచ్ కి అయ్యే ఖర్చు అమెరికా, రష్యా, ఇతర దేశాలు పే చేస్తున్న బిల్ లోంచే సరిపోతోంది! ఇలా ఎన్నో విధాలుగా తాజా ప్రయోగం ఇస్రో చరిత్రలో, ఇండియా చరిత్రలో సరికొత్త ఆధ్యాయమే!
http://www.teluguone.com/news/content/indian-space-research-organisation-45-72158.html





