LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం (మార్చి 31) కొట్టివేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్, మంత్రి నారాయణలపై  అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  ఐఆర్ఆర్ అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని సీఐడీ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం అధికారికంగా ఆమోదించింది. జగన్ హయాంలో  అప్పటి మంగళగిరి  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది.  2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే..  రాష్ట్రంలో  జగన్ అధికారం కోల్పోయి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత  ఈ కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటు చేసుకుంది. గతంలో జరిగిన విచారణ  సరళిని సమీక్షించిన సీఐడీ అధికారులు.. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లభించలేదని నిర్ధారించారు. దీంతో ఈ కేసును  మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్  కింద పరిగణించి  మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో  ఫైనల్ క్లోజర్ రిపోర్ట్  దాఖలు చేశారు. సీఐడీ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం    సీఐడీ దర్యాప్తు నివేదికతో ఏకీభవిస్తూ, చంద్రబాబు సహా ఇతరులపై ఉన్న కేసులను  కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.   గతంలో కూడా ఈ కేసు విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పలుమార్లు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిం చారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు చుక్కుదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా  ఏసీబీ కోర్టు ఐఆర్ఆర్ కేసు కోట్టివేసింది.   ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని ఈ తీర్పుతో స్పష్టమైందని న్యాయ నిపుణులు అంటున్నారు.  
పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం  ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఎస్పీ కార్యాలయంలో ఏకంగా పది గంటల పాటు బైఠాయించి సంచలనం సృష్టించారు. పల్పాడు   జిల్లా పోలీసు  లీగల్ సలహాదారుగా తాను రికమెండ్ చేసిన వ్యక్తిని వెంటనే నియమించాలంటూ ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి ఏకంగా పది గంటల పాటు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై తెలుగుదేశం అధిష్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   విషయమేంటంటే.. పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా  మంగళవారం (మార్చి 31) ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు. ఆయన  విచారణ జరిపి ఉత్తర్వులిస్తానని చెప్పారు. అయితే ఎమ్మెల్యే చదలవాడ మాత్రం నియామక పత్రం చేతికిచ్చే వరకు కదిలేది లేదని  ఎస్పీ ఛాంబర్‌లోనే  కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో ఆయన తీవ్ర వాగ్వాదానికి పాల్పడ్డారు.  ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎస్పీ చాంబర్ లోనే కూర్చున్న ఎమ్మెల్యే ఒక దశలో  ఆ చాంబర్ లోని  బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత కార్యాలయాల నుంచి ఫోన్లో మాట్లాడినా ఆయన బయటకు రాలేదు. దీంతో పోలీసులు డంబెల్స్‌తో బాత్రూం డోర్ పగలగొట్టి ఆయన్ను బయటకు తీసుకువచ్చారు. చివరకు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర తెలుగుదేశం నేతలు వచ్చి బుధవారం (ఏప్రిల్ 1) సాయంత్రంలోగా  నియామక ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శాంతించారు. రాత్రి తొమ్మదిన్నర గంటల ప్రాంతంలో ఆయన తన నిరసర విరమించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో   అత్యంత కీలకమైన అంశం అమరావతి.  ఈ విషయంలో  వైఎసీపీ అధినేత  జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట  కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర  పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం  వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట.  అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు.  తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది.   మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.  ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.  
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తర్వాత రూటు మార్చిన అఖిల్, ప్రస్తుతం 'లెనిన్' (Lenin) అనే విభిన్నమైన సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు మారుతి(Maruthi)తో అఖిల్ ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. హిట్ కోసం మారుతి ప్రయత్నం దర్శకుడు మారుతి ఇటీవల ప్రభాస్‌తో చేసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా ఒక పక్కా కమర్షియల్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ కోసం ఒక క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాగా, మారుతి గతంలో అక్కినేని హీరో నాగచైతన్యతో 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమా చేయడం విశేషం. చర్చల దశలో ప్రాజెక్ట్ అఖిల్, మారుతి మధ్య ఇప్పటికే పలుసార్లు కథా చర్చలు జరిగినట్లు సమాచారం. అఖిల్ ప్రస్తుతం తన ఇమేజ్‌కు సరిపోయే, అదే సమయంలో వైవిధ్యంగా ఉండే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. మారుతి చెప్పిన లైన్ పట్ల అఖిల్ పాజిటివ్ గా ఉన్నాడని, అయితే పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యాక తుది నిర్ణయం తీసుకుంటారని వినికిడి. వరుసగా కథలు వింటున్న అఖిల్ 'ఏజెంట్' రిజల్ట్ తర్వాత అఖిల్ తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కేవలం మారుతి మాత్రమే కాకుండా మరికొందరు యువ దర్శకులతో కూడా ఆయన టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'లెనిన్' పూర్తి కాగానే, తన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్‌పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషియేటివ్ తీసుకుంది.  హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు.  కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన  అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం.
The Allu Arjun Fans Association has stepped forward to support the HPV vaccination drive. Inspired by the words of Icon Star Allu Arjun, who encourages doing at least one good deed every year, AAFA has taken up this initiative. The association plans to conduct awareness programs throughout the year to educate people about the importance of the HPV vaccine. By taking the HPV vaccine, young girls can be protected from Cervical Cancer and lead healthier lives. Girls and women between the ages of 9 and 26 can receive this vaccine free of cost through government hospitals. As part of the central government’s “Swasth Nari Viksit Bharat” program, the vaccine is being provided free of charge to girls and women across the country. It is commendable that AAFA has chosen to support such a meaningful social cause on the occasion of Allu Arjun’s birthday on April 8th. This initiative will inspire other fandoms to serve the public.
  నటిగా సమంత క్రేజ్ తెలిసిందే  ఆమె కెరీర్ లో రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్  రామ లచ్చిమిగా ఒక రేంజ్ పెర్ ఫార్మెన్స్  వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్    రంగస్థలం(Rangasthalam).. హీరోలు,దర్శకులకే కాదు మూవీకి కూడా అభిమానులు, డై హార్ట్స్  ఫ్యాన్స్ ఉంటారని నిరూపించిన చిత్రాల్లో ఒకటి. రామ్ చరణ్(Ram Charan)  సుకుమార్(Sukumar)అయితే ఈ పేరు తలుచుకోకుండా తమ దినచర్యని ప్రారంభించకుండా ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా రంగస్థలం ఆ ఇద్దరి సినీ లైఫ్ లో మంచి బూస్టప్ ని ఇచ్చింది. అసలు ఆ ఇద్దరు ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సినీ పర్సనాలిటీస్ గా ఉండటానికి కూడా రంగస్థలం కారణం. మరి సమంతకి కూడా స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు. ఆమెకి స్పెషల్ మూవీ ఏంటి! అసలు సమంత తప్ప మరొకరు రామలచ్చిమిగా చేస్తే రంగస్థలం రిజల్ట్ లో కొంచం తేడా ఏమైనా వచ్చేదేమో. అంతలా బుచ్చిబాబు(రామ్ చరణ్) ని ఆటపట్టించి ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు రేపింది. ఇక రంగస్థలం మార్చి 30 తో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా కొన్ని స్వీట్ మెమొరీస్ అభిమానుల, ప్రేక్షకుల హృదయాల్లో సోషల్ మీడియా సాక్షిగా మరో సారి గిలిగింతలు రేపుతున్నాయి.  ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రంగస్థలం తన ప్రభావాన్ని చూపిస్తున్న రోజులు. ఆ టైంలో సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు సమంత(Samantha)ని హీరోయిన్ గా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కొత్త అమ్మాయి, లేదా నార్మల్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నా. రామ్ చరణ్, సమంత ఇద్దరూ స్టార్లే కాబట్టి ,ఆ ఇద్దర్ని సెట్ లో మేనేజ్ చేయలేనేమో అనేది నా భావన. కానీ సమంత ఒక్కో సీన్ లో చేసే విధానం చూసినప్పుడల్లా నా చెంప చెళ్లుమనిపించినట్లు అయింది. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఇకపై సమంతతో సినిమాలు చేస్తూనే ఉండాలని డిసైడ్ అయ్యాను. also read: Ranjith: లైంగిక ఆరోపణల నేపథ్యంలో సంచలన దర్శకుడు అరెస్ట్  ఇక అప్పటికి సమంతకి వివాహం జరిగింది. అయినా కూడా రంగస్థలం మూవీలో లిప్ లాక్ సీన్ లో చేసింది. ఆ సీన్ చేస్తున్నప్పుడు, తనకి పెళ్లయిందా కాలేదా అని ఆలోచించలేదు. ఆమె క్యారక్టర్ కి ప్రేమని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియని పరిస్థితి . దీంతో ముద్దు పెట్టుకుని ప్రేమని చేయాలి. కళాత్మకంగా మాత్రమే సదరు ముద్దు సన్నివేశాన్ని  చూడాలని సుకుమార్ అన్నారు. ఇక అదే ఇంటర్వ్యూలో 80వ దశకంలో అంత రొమాన్స్ ఉండేదా అని యాంకర్ ప్రశ్నించింది. అప్పుడు సుకుమార్ మాట్లాడుతు  . మీది పల్లెటూరు అయితే మీకు అర్థం అవుతుంది. అప్పట్లో సరసం అనేది లైఫ్ లో ఒక భాగంగా ఉండేది. దానిని వల్గర్ గా చూసేవాళ్ళు కాదు. లిప్ లాక్ సీన్ ని ఒక ఆర్ట్ ఫామ్ లా మాత్రమే చూడాలని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకతంలోనే వచ్చిన పుష్ప లో సమంత స్పెషల్ సాంగ్ చేసి పుష్ప ఇంకొన్ని రోజులు స్క్రీన్ పై నడిచేలా చెయ్యడంలో తన వంతు సినీ ధర్మాన్ని నిర్వర్తించిన విషయం తెలిసిందే.       
ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి అసెంబ్లీలో, సామాన్యుడి గొంతు వినిపించడం ఒక అరుదైన దృశ్యం. కానీ, తన భూమిని, భవిష్యత్తును నమ్ముకున్న ఒక రైతు, పాలకుల కళ్ళు తెరిపించడానికి ఆ గడప తొక్కితే.. అది కేవలం ఒక నిరసన కాదు, నేల తల్లి పడుతున్న ఘోష.  ఓ వైపు అభివృద్ధి ఆశలు, మరోవైపు పాలకుల అహంకారం మధ్య నలిగిపోతున్న అమరావతి రైతుల ఆవేదనను కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా 'అమరావతి ఫైల్స్'(Amaravati Files). విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమాలో ఎన్నో గొప్ప సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైతుబిడ్డ అసెంబ్లీ సాక్షిగా సీఎంను నిలదీసే సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. నిస్వార్థ త్యాగం - అధికార దాహం: రాజధాని నిర్మాణం కోసం తమ పచ్చని పొలాలను త్యాగం చేసిన రైతులది ఎంత గొప్ప సంస్కారం? కానీ, అధికారంలోకి రాగానే మాట మార్చి, రాజధానిని ఒక ఆట వస్తువుగా మార్చడం ఎంతటి ద్రోహం? ఒక ప్రభుత్వం ఒక పథకం పెడితే, మరో ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేయడం సహజమేమో కానీ, రాజధాని కూడా ఒక పథకం లాంటిదేనా? అని ఆ రైతు వేసిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒకే రాజధాని ఉన్నప్పుడు, కేవలం 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? ఇది ప్రజల ప్రయోజనం కోసమా లేక వ్యక్తిగత ద్వేషమా? అంటూ రైతు నిలదీసే తీరు అద్భుతం. దిగజారుతున్న రాజకీయ విలువలు: ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ మన ఆంధ్రప్రదేశ్. కానీ నేడు, 'భవతి భిక్షాందేహి' అన్నట్లుగా అప్పుల కోసం అందరినీ అర్ధించే స్థాయికి దిగజారిపోయింది.. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు వాడే భాష, ప్రవర్తించే తీరు చూస్తుంటే, ఆ వ్యవస్థ ఎంత అపవిత్రమైందో అర్థమవుతోంది.. భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ప్రజల కోసం పాలన సాగించిన ఈ దేశంలో, నేడు పదవులే ముఖ్యం, అహంకారమే లక్ష్యం అనుకునే పాలకులు పుట్టడం దురదృష్టకరం అని అసెంబ్లీలో రైతు గర్జించాడు. అణచివేత, కన్నీటి గాథ: ప్రజల గొంతును అసెంబ్లీ లోపల వినిపించకుండా లైవ్ కట్ చేయడం, ప్రజా పోరాటాలను కొందరి సమస్యగా చిత్రీకరించడం ఏ రకమైన న్యాయం?. అమరావతి ముట్టడికి వెళ్లి తిరిగి వస్తూ, విషాహారం వల్ల 70 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం గుండెలను పిండేసే సంఘటన.. ఈ మరణాల వెనుక ఉన్న కుట్రలు, పోస్ట్‌మార్టం రిపోర్టులను మార్చగలిగే అధికారం.. ఇవన్నీ చూస్తుంటే సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయిందనిపిస్తుంది.. మన ఆదాయం ఇతర రాష్ట్రాలకు టాక్స్ రూపంలో పోతుంటే, మన యువత ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే, రాజధాని లేని రాష్ట్ర ఉనికి ఎక్కడుంటుంది? అని రైతు ప్రశ్నించే తీరు కట్టిపడేసింది. రాజధాని అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం కాదు.. అది ఒక రాష్ట్ర ఆత్మగౌరవం, లక్షలాది మంది రైతుల నమ్మకం. ప్రజల కన్నీళ్లు చూసిన వాడికి ప్రభుత్వ లాఠీ దెబ్బలు, బుల్లెట్లు భయం కలిగించవు.. సమస్యకు పరిష్కారం దొరికే వరకు, నేల తల్లి సాక్షిగా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది, కానీ ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని రాజధాని విలువని రైతు చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. 'అమరావతి ఫైల్స్' ఫుల్ మూవీ కోసం, ఇలాంటి అద్భుతమైన సన్నివేశాల కోసం మా తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.  
  -చిత్ర సీమని కుదిపేసిన దర్శకుడి అరెస్ట్  -రెండుసార్లు కోర్టు కొట్టివేసింది -ఇప్పుడు మూడోసారి ఏకంగా అరెస్ట్  -పూర్తి డీటెయిల్స్ చూద్దాం రంజిత్ బాలకృష్ణన్(Ranjith Balakrishnan).. మలయాళ చిత్ర సీమలో క్రియేటివ్ దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నటుడుగా, రచయితగా అనేక చిత్రాలకి పని చేసి 2001లో దర్శకుడిగా మారి ఇప్పటి వరకు సుమారు ఇరవై రెండు చిత్రాల వరకు తెరకెక్కించాడు. రీసెంట్ గా రంజిత్ పై ఒక నటి లైంగిక ఆరోపణల చేయడంతో కొచ్చి పోలీసులు అరెస్ట్ చెయ్యడం సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఒక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు రంజిత్  తనని కారవాన్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారని సదరు నటి జస్టిస్ హేమ కమిటీతో పాటు పోలీసులకి ఫిర్యాదు  చేసింది. ఈ మేరకు కొచ్చి సిటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఇడుక్కి జిల్లాలో ఉన్న రంజిత్‌ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. రంజిత్ పై  2024లోను ఒక బెంగాలీ నటి లైంగిక ఆరోపణల కేసు నమోదు చేసింది.  2009లో 'పలేరి మాణిక్యం' సినిమా షూటింగ్ సమయంలో కొచ్చిలోని గెస్ట్ హౌస్‌లో రెంజిత్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక దాడికి ప్రయత్నించారనేది ఆమె ఆరోపణ. దీంతో  పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. గత అక్టోబర్‌లో విచారణకి రాగా 2009లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేయడానికి మెజిస్ట్రేట్ కోర్టుకి ఉన్న కాలపరిమితి ముగిసిపోయిందని హైకోర్టు తన తీర్పుని వెల్లడి చేస్తూ కొట్టివేసింది.  2012లో బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో డైరెక్టర్ రెంజిత్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని,  దుస్తులు లేని చిత్రాలు కూడా తీశాడని కోజికోడ్‌ కి చెందిన ఒక యువకుడు ఫిర్యాదు చేశాడు.దీంతో ఎర్నాకుళం నార్త్ పోలీసులు రెంజిత్‌పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఫిర్యాదు చేయడానికి 12 ఏళ్లు ఆలస్యమైందన్న కారణంతో కర్ణాటక హైకోర్టు 2025 జులైలో ఆ కేసుని కూడా రద్దు చేసింది. అలాంటిది ఇప్పుడు  మూడో సారి లైంగిక ఆరోపణలతోనే రంజిత్ అరెస్ట్ కావడం గమనార్హం. రంజిత్ నుంచి గత ఏడాది ఆరో, సమ్ వన్ అనే షార్ట్ ఫిలిం వచ్చింది.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి గ్లింప్స్ వరకు ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా రీసెంట్‌గా విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, ఏఆర్ రెహమాన్ సంగీతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. 90s నాటి రెహమాన్‌ కనిపిస్తున్నారు.. పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి రఘు కుంచె మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాట 'చికిరి చికిరి'. ప్రతి రోజూ వింటున్నాను. చాలా కాలం తర్వాత రెహమాన్ గారు మళ్ళీ తన వింటేజ్ స్టైల్‌ను చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆయన సాంగ్స్ చాలా సింపుల్ గా, మెలోడియస్ గా ఉండేవి. ఆ తర్వాత ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాక కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వైపు వెళ్లారు. కానీ 'పెద్ది' చిత్రంతో మళ్ళీ తన మార్కు 90ల నాటి వింటేజ్ రెహమాన్‌ను గుర్తుచేస్తున్నారు. ఆ పాటల్లోని ఫ్లేవర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు సానా రెహమాన్ నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్‌ను అద్భుతంగా రాబట్టుకున్నారు" అని ప్రశంసించారు. మట్టి వాసన ఉన్న కథలు ఎప్పుడూ స్పెషలే.. ప్రస్తుతం ప్రేక్షకులు రూటెడ్ కథలకు, అంటే మట్టి వాసన ఉన్న విలేజ్ సబ్జెక్టులకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారని రఘు కుంచె అభిప్రాయపడ్డారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే కథలు కేవలం పాత జ్ఞాపకాలనే కాకుండా, కొత్త తరానికి ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమిళంలో మారి సెల్వరాజ్, వెట్రిమారన్ వంటి దర్శకులు ఇలాంటి కథలతోనే అద్భుతాలు సృష్టిస్తున్నారని, ఇప్పుడు మన తెలుగులో కూడా అలాంటి ప్రయత్నాలు జరగడం శుభపరిణామమని అన్నారు. 'పెద్ది' కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ రూటెడ్ సబ్జెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. పహిల్వాన్ లుక్ అదిరిపోయింది..  రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో చరణ్ ధరించిన గోచి కట్టు, ఆయన మాసివ్ బాడీ లాంగ్వేజ్‌ను చూసి అంతా షాక్ అవుతున్నారు. దీనిపై రఘు కుంచె స్పందిస్తూ.. "అది నిజమైన పహిల్వాన్ లుక్. చరణ్ పడ్డ కష్టం ఆ స్క్రీన్‌పై కనిపిస్తోంది. నిజానికి ఆ కుస్తీ ఫైట్లు చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని విన్నాను. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా అంత రిస్క్ తీసుకుని రియలిస్టిక్‌గా చేయడం గొప్ప విషయం." అని చరణ్ డెడికేషన్‌ను కొనియాడారు. నటనలో కష్టం.. సౌకర్యాల మధ్యే అసలైన సవాల్.. పూర్వం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో ఆర్క్ లైట్ల కింద నటించడం ఎంతో కష్టంగా ఉండేదని, ఇప్పటి హీరోలకు క్యారవాన్లు వంటి సౌకర్యాలు ఉన్నా.. క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయడంలో అదే కష్టం ఉంటుందని రఘు కుంచె వివరించారు. రామ్ చరణ్ తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక పల్లెటూరి మల్లయోధుడిగా మారడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. మొత్తానికి 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, బుచ్చిబాబు సానా మేకింగ్ మరియు రెహమాన్ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని రఘు కుంచె నమ్మకం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రఘు కుంచె ఫుల్ ఇంటర్వ్యూ & మరిన్ని ఆసక్తికర సినీ విశేషాల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.   
బాలకృష్ణ బుల్లెట్ స్పీడ్ NBK 111 సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు ఊహించని దర్శకులకు ఓకే చెప్పిన బాలయ్య నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆయన, కుర్ర హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (NBK 111) షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య.. మరో ఇద్దరు కుర్ర దర్శకులతో సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కనకమేడలతో బాలయ్య జతకట్టబోతున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ కనకమేడల చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందని, అందులోని ఇంటెన్సిటీ ఆయనను ఇంప్రెస్ చేసిందని సమాచారం. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట.  విజయ్ చెప్పిన పాయింట్ చాలా డిఫరెంట్‌గా ఉండటంతో బాలకృష్ణ వెంటనే ఓకే చెప్పేశారట. తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసేలా ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజానికి విజయ్ కనకమేడల సినిమాలంటే అందులో సామాజిక అంశాలతో పాటు గ్రిప్పింగ్ నరేషన్ ఉంటుంది. ‘నాంది’లో న్యాయవ్యవస్థలోని లోపాలను చూపించి మెప్పించిన ఆయన, బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ లేదా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తికాగానే విజయ్ కనకమేడల సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నయా క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.  విజయ్ కనకమేడల ప్రాజెక్టుతో పాటు, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించవచ్చని టాక్. సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకోవాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వైవిధ్యమైన దర్శకులతో పనిచేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. మొత్తానికి బాలయ్య తన సినిమాల వేగాన్ని పెంచడమే కాకుండా, కథల ఎంపికలో కూడా కొత్తదనాన్ని చూపిస్తూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ లైనప్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. "బాలయ్య బాబు స్పీడు మామూలుగా లేదు.. వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తున్నారు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచూ వింటుంటాం. అప్పుడప్పుడు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ నైనిక(Nainika) చేరింది. తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను, అలాగే ఊర్లో ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో తాజాగా బయటపెట్టింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 80 లక్షలతో హైదరాబాద్‌లో వ్యాపారం ఒడిశా నుంచి హైదరాబాద్‌కు మారిన తర్వాత, తన తల్లికి ఏదైనా వ్యాపారం ఉండాలనే ఉద్దేశంతో నైనిక ఒక లగ్జరీ సలోన్ (స్టూడియో) ప్రారంభించాలని నిర్ణయింకుంది. అయితే దీని వెనుక పెద్ద త్యాగమే ఉందని ఆమె తెలిపింది. ఒడిశాలో తన తల్లి ఎంతో కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో సుమారు రూ. 70 నుంచి 80 లక్షల వరకు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌లో ఈ సలోన్ ను ఏర్పాటు చేసినట్లు నైనిక చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగానే సాగుతోందని, హైదరాబాద్ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ అనుభవం తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, కానీ క్లీన్ ప్రాజెక్ట్‌లు దొరకడం కష్టమవుతోందని తెలిపింది. కొన్నిసార్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని నైనిక ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ నిర్మాత తనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పి 'కమిట్‌మెంట్' అడిగారని ఆమె వెల్లదించింది. "కమిట్‌మెంట్ అడుగుతూ ఓ నిర్మాత మెసేజ్ లో ఒక ఫామ్ లాంటిది నింపమని పంపారు. అది చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. మీకు సిగ్గులేదా? అని గట్టిగా రిప్లై ఇచ్చాను" అని నైనిక పేర్కొంది.  నైనిక ప్రయాణం చిన్నప్పటి నుంచే చాలా కష్టాలతో కూడుకున్నది. తండ్రి నుంచి ఎదురైన వేధింపుల కారణంగా తల్లితో కలిసి ఒంటరిగా పోరాటం చేసి ఈ స్థాయికి చేరుకుంది. నేషనల్ లెవల్ డ్యాన్స్ రియాలిటీ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’లో సత్తా చాటిన నైనిక, ఆ తర్వాత తెలుగులో ‘ఢీ’ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా కంటెస్టెంట్‌గా అలరించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.  కష్టపడి ఎదుగుతున్న నైనిక.. తన జీవితంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ అనుభవాలను పంచుకోవడంతో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. టాలెంట్ ని బట్టి కాకుండా, కమిట్‌మెంట్ ని బట్టి అవకాశాలు ఇచ్చే కొందరు నిర్మాతల వల్లే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే అమ్మాయిలు భయపడుతున్నారు అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. Also Read: ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి తప్పుకున్న టోవినో థామస్! https://www.instagram.com/reel/DWOlHU3kzzJ/
శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్'(Biker). అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్(Rajasekhar) కీలక పాత్ర పోషించడం విశేషం. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ ఫిల్మ్ గా ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన రాజశేఖర్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. - చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్  ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.  - ముందుగా నేను ఏ క్యారెక్టర్ చేసినా అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.  - నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత  బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని  రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్  అమ్మేశారు (నవ్వుతూ). బైకర్ లో నా  క్యారెక్టర్ పేరు బుల్లెట్ సునీల్. ఈ క్యారెక్టర్ గురించి పూర్తి వివరాలు మీరు సినిమాలోనే చూడాలి.  - అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద, క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్న దర్శకుడు . ఆయన అనుకున్నది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్. ఈ క్యారెక్టర్ కి సంబంధించి ఆయన ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాలో నన్ను చాలా కొత్తగా చూపించారు. డైరెక్టర్ విజన్. కథ వల్లే అది సాధ్యపడింది. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నా క్యారెక్టర్ ని  అభినందిస్తారు.  - ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.  - యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు. ఎక్కడ ఖర్చుకి వెనకాడరు. ఈ సినిమాని హాలీవుడ్ క్వాలిటీతో తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు కోసం క్వాలిటీ కోసం ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. ఈ విషయంలో వారిని అభినందించాలి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.  - నాకు ఫ్యామిలీ ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఈ సినిమా,  నా క్యారెక్టర్  ఇంత అద్భుతంగా రావడానికి  ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.  - మా పాషన్, ప్రొఫెషన్ రెండు సినిమానే. ఇంట్లో మొత్తం సినిమా వాతావరణమే ఉంటుంది. కొత్త సినిమాలు రిలీజ్ అయితే నేరుగా థియేటర్స్ కి వెళ్లి చూస్తుంటాం. అలాగే ఏదైనా కథ క్యారెక్టర్ వస్తే అందరం కలిసి డిస్కస్ చేస్తాం. అలాగే షూటింగ్లో జరిగిన విశేషాలు కూడా మాట్లాడుకుంటుంటాం. మేమందరం కూడా సినిమా ప్రొఫెషన్ లోనే ఉన్నాం కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది.  - పవన్ సాదినేని గారితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య, విశ్వదేవ్, శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం.  బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.  
  జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది,  ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం పదమూడవ రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు జైన మతానికి చెందిన 24వ తీర్థంకరుడైన  మహావీరుని జన్మదినోత్సవం. ఈ సంవత్సరం, మహావీర్ జయంతి 2026 మార్చి 31, మంగళవారం నాడు  వచ్చింది.  యువరాజు వర్థమానుడు.. మహావీరుడిగా ఎలా పరివర్తన చెందాడు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మహావీరుని పంచ వ్రతాలైన అహింస, సత్యం, అపవిత్రత, బ్రహ్మచర్యం, అపరిగ్రహం జైన మతానికి మూలస్తంభాలు.  మహావీరుని జన్మదినోత్సవం జైన సమాజానికి ఒక ప్రధాన పండుగ. ఈ పవిత్రమైన రోజున, జైన దేవాలయాలను అలంకరిస్తారు,  మహావీరుని విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తారు, భారీ రథయాత్రలను నిర్వహిస్తారు. ప్రజలు దానధర్మాలు చేస్తారు , మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సాధారణ మానవుడిగా జన్మించిన వర్థమానుడు  తన జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించుకుని, జ్ఞానోదయం పొందిన ఆత్మగా, మహావీరడిగా మారి, అసాధారణమైన కార్యాలు సాధించారు. ఆయన ఒక రాజభవనంలో జన్మించి, పుట్టుకతోనే యువరాజు అయినప్పటికీ,  జ్ఞానాన్వేషణలో త్యాగాన్ని, అంకితభావాన్ని అనుసరిస్తూ మహావీరుడిగా మారారు. కానీ యువరాజు వర్ధమానుడి నుండి మహావీరుడిగా ఆయన ప్రయాణం మరింత అద్భుతమైనది. వర్థమానుడు మహావీరుడిగా మారిన ప్రయాణం..  మహావీరుడు సుమారు 2,500 సంవత్సరాల క్రితం క్రీ.పూ. 599లో  వైశాలిలోని క్షత్రియకుండ గ్రామంలో ఒక క్షత్రియ రాజ కుటుంబంలో జన్మించారు. పుట్టినప్పుడు, అతని తల్లిదండ్రులు అతని శ్రేయస్సు  బాగుండాలని  వర్ధమాన అని పేరు పెట్టారు. వర్ధమానుని తండ్రి సిద్ధార్థుడు ,అతని తల్లి త్రిశాల. శ్వేతాంబర సంప్రదాయం ప్రకారం వర్ధమానుడు యువరాణి యశోదను వివాహం చేసుకున్నాడు. అయితే దిగంబర సంప్రదాయం మహావీరుడిని జీవితాంతం బ్రహ్మచారిగా వర్ణిస్తుంది. 30 ఏళ్ల వయసులో వర్ధమాన యువరాజు లౌకిక జీవితాన్ని త్యజించాలని నిశ్చయించుకుని, సర్వస్వం త్యజించి సత్యం , జ్ఞానం కోసం అన్వేషిస్తూ  బయలుదేరాడు. దీక్ష స్వీకరించిన తరువాత, అతను ఒక సంవత్సరానికి పైగా దేవదూష్య వస్త్రాలు ధరించి, ఆపై వస్త్రాలు విడిచిపెట్టి, తపస్సు మార్గాన్ని అనుసరించి కఠోర తపస్సు చేశాడు. 12 సంవత్సరాల మౌనం, తపస్సు, ఉపవాసం , ఆత్మసంయమనం తరువాత చివరకు రిజుబాలిక నది ఒడ్డున ఉన్న ఒక సాల వృక్షం కింద కైవల్యాన్ని పొందాడు. 42 ఏళ్ల వయసులో దివ్య జ్ఞానోదయం పొందిన తర్వాత,  మహావీరుడు  తన జీవితంలోని తదుపరి 30 సంవత్సరాలు బీహార్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ సమయంలో, ఆయన ధర్మ సందేశాన్ని కూడా వ్యాప్తి చేశారు. 72 ఏళ్ల వయసులో, దీపావళి కార్తీక అమావాస్య రోజున,  మహావీరుడు బీహార్‌లోని పావాపురిలో  నిర్వాణం పొందారు. ఇది మహావీరుడి కథ..!                                       *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి.  చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. తప్పులు వెతకడం.. భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది. మౌనం.. భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది.  భాగస్వామిని పట్టించుకోకుండా  మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి,  మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల  భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. పాత  విషయాలు.. గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది,   ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు. ఆధిపత్యం.. ప్రేమ అంటే  భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు.  భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు,  అక్క చెళ్లేళ్లు,  అన్నదమ్ములు ఇలా అందరితో  పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల  భాగస్వామి బాధపడవచ్చు.  బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది.                                            *రూపశ్రీ  
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి.  ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి... ఊబకాయం ఎలా పెరుగుతుందంటే.. కార్యకలాపాలు లేకపోవడం.. శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్  గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. ఉష్టోగ్రత.. వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది. ఆకలి.. చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి. చెమట, డిటాక్స్.. చెమట పట్టడం అనేది శరీరం  సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం,  ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మనస్సు, శరీరం.. చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది.  సోమరితనం పెంచుతుంది. ఇలా జాగ్రత్త పడాలి.. ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి,  లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి. ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. తాజా పండ్లు, సలాడ్లు,  నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి. విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.                                   *రూపశ్రీ.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.