Publish Date:Mar 24, 2013
ఢిల్లీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్ట్ మూడో రోజు 266/8తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి ఆలౌట్ అయింది. లియోన్ ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. మాక్స్‌వెల్, సిడిల్, పాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆతరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వార్నర్, మాక్స్‌వెల్‌లు ఆరంభంలోనే అవుటయ్యారు. మాక్స్‌వెల్, వార్నర్ జడెజా ఆవుట్ చేసి ఆదిలోనే దెబ్బ తీశాడు. కొవాన్, హ్యూస్ క్రీజులో నిలకడగా అడే ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు. కేవలం 53 పరుగులకే ఆసీస్ ఐదు కీలక వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత వేడ్, స్మిత్‌లు కాసేపు నిలకడగా ఆడారు. అనంతరం స్మిత్(18) జడెజా బౌలింగులో ఆరో వికెట్‌గా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాన్సన్ పరుగులేమీ చేయకుండానే క్రీజు వదిలాడు. ఆ తర్వాత వేడ్(19) ఓజా బౌలింగులో ధోనీకి క్యాచ్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. 157 పరుగుల వద్ద పాటిన్సన్(11) రూపంలో తొమ్మిదో వికెట్ పడిపోయింది. సిడిల్(50) ఒక్కడే రాణించాడు. తోమ్మిదో నెంబరులో వచ్చి రెండు వరుస అర్ధసెంచరీలు చేసిన ఘనత సిడిల్‌కి దక్కింది. 164 పరుగుల వద్ద ఆసీస్ ఆఖరి వికెట్ కోల్పోయింది. జడెజా ఐదు, ఓజా, అశ్విన్‌లు చెరో రెండు, ఇషాంత్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ లక్ష్యం 155 పరుగులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-australia-36-21881.html
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
రెండు మూడు రోజుల కిందట ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకార దాడులకు దిగింది పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుంటూ వెళ్లేలా అధునాతన డ్రోన్లతో తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి.