రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ నేత మాధవీలత తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు. హైదరాబాద్ గచ్చిబౌలి శాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరిగిన 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాధవీలత 25 మీటర్ల పిస్టల్ మాస్టర్స్ ఉమెన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. ఈ పోటీల్లో మొత్తం 300 పాయింట్లకు గాను ఏకంగా 245 పాయింట్లు సాధించి పసిడి పతకం కైవశం చేసుకున్నారు.
షూటింగ్ పై తనకు చిన్నతనం నుంచీ మక్కువ ఉందని ఈ సందర్భంగా మాధవీలత చెప్పారు. ఎన్‌సీసీ కేడెట్‌గా ఉన్న రోజుల్లో, రిపబ్లిక్ డే శిక్షణ తరగతుల్లో భాగంగా తాను మొదటిసారి రైఫిల్ ప్రాక్టీస్ చేశానని, అప్పటి నుంచీ షూటింగ్ క్రీడపై ఆసక్తి పెరిగిందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-bjp-leader-madhavi-latha-wins-gold-36-224709.html
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.