ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ
Publish Date:Jan 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్‌కుమార్, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, చిత్తూరు జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు పోస్ట్‌లు ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.
http://www.teluguone.com/news/content/ias-officers-transferred-in-ap-36-212405.html





