నారావారిపల్లిలో ఘనంగా సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
Publish Date:Jan 15, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమ కులదైవం నాగాలమ్మకు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తండ్రి ఖర్జూరనాయుడు, తమ్ముడు రామ్మూర్తి సమాధుల వద్ద నివాళులు అర్పించారు.అలానే ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. వారిరి స్మరించుకున్నారు. గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేశారు. పండుగ వాతావరణంలో సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ వారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి, వినతులు ఇవ్వడానికి పెద్దఎత్తున ప్రజలు నారావారిపల్లికు చేరుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్, భువనేశ్వరి, నారా రోహిత్, నందమూరి రామకృష్ణ, ఎంపీ భరత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఉండవల్లికి చేరుకుంటారు.
http://www.teluguone.com/news/content/sankranti-celebrations-naravaripalle-36-212545.html





