ఐ.ఎ.ఎస్‌.లు ఆగ్రహిస్తే ఏమవుతుంది?

Publish Date:Jul 16, 2012

Advertisement

ఇప్పుడంటే ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ పెరిగి ఐటి జాబ్స్‌ వచ్చి లక్షల్లో సాలరీస్‌ ఆరునెల్లకొక సారి ఫారిన్‌ ట్రిప్‌, ఎంఎన్‌సి కంపెనీల్లో షేర్లు, కార్లు ఓప్‌....కానీ ఇవన్నీలేనప్పుడు చదువంటే సివిల్‌ సర్వీసే....పెద్ద ఉద్యోగం అంటే కలెక్టరే....వారు బుద్దిబలంలో బృహస్పతులని, పేదలపాలిటి పండువెన్నెల కురిపించే పూర్ణచంద్రులని గుర్తింపు ఉండేది. కలెక్టరు ప్రక్కనే ఎప్పుడూ తిరిగే బిళ్ళ బంట్రోతు అంటేనే ప్రజలకు గౌరవాభిమానాలు ఉండేవి. కలెక్టరు అంటే చెప్పనక్కర్లేంనంత భయం భక్తీ ఉండేవి....అలాంటి రోజుల్లో చంద్రబాబునాయుడు పరిపాలనలో జన్మభూమి కార్యక్రమం చేపట్టారు.


 

కలెక్టరు కూడా రోడ్లు ఊడ్చడం, మిగతా అధికారులంతా మురిగి కాల్వలు శుబ్రపరచడం మొదలైన పనులుండేవి. మేధాసంపన్నులతో లేబర్‌పనులు చేయించడం ఏంటని ప్రతిపక్షాలు ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. అదే సమయంలో ప్రజలవద్దకే పాలన అంటూ మంత్రివర్యులంతా ఊళ్లు తిరిగేవారు. ప్రజలెవరైనా అధికారుల మీద ఆరోపణచేస్తే చాలు ఉద్యోగాన్ని హూఫ్‌ అంటూ ఊదేసేవారు ఏలినవారు. నిజానిజాలేమంటూ విచారణలేముండేవి కాదు. సదరు ఉద్యోగాధికారులంతా  పని చేసుకుందామని ఆఫీసుకు వచ్చి, ఉద్యోగాలు ఊడగొట్టుకొని ఇంటికెళ్లల్సిన పరిస్థితి ఏంటా అని గుండెనెప్పి వచ్చి పడిపోయిన వారు ఉన్నారు. పైకి పోయిన వారు ఉన్నారు. ఆతర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేదు. ఒక వేళ గెలిచి ఉంటే కలెక్టర్లతో రోడ్లు ఊడ్చించి, రోడ్లువూడ్చేవాళ్లతో కలెక్టరీగిరి చేయించేవారేమో....ప్రభుత్వం మారింది. ఇదివరకటి కష్టాలు కలెక్టర్లకు తప్పాయి. హమ్మయ్య అనుకున్నారు.


ఇంతలో మళ్లీ ప్రభుత్వం మారలేదుకాని, ప్రభుత్వంలోని వ్యక్తులు మారారు. అంతే అంతకు ముందు ముఖ్యమంత్రికి అనుకూలంగా పనిచేశారని,లంచాలు తీసుకున్నారని,అదని, ఇదని.... ఆడ, మగని కూడా చూడకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏతావాతా తేలేదేమిటంటే పనిచేసినా, చెయ్యకపోయినా అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోయేది కలెక్టర్లే అని. వాళ్లతో చాకిరీచేయించి అనుకూలంగా పనులుచేయించుకున్న మంత్రివర్గం మాత్రం సేఫ్‌. ఈ క్రమంలోనే  జైల్లో పడవేయబడిన వారికి, జైల్లోకి త్రోసేవారికి మద్య (సివిల్‌ సర్వీస్‌ల్లో ) ఎవరు గొప్పా అని ఎప్పుడూ నిరువుగప్పిన నిప్పులా ఉండే ఆధిపత్యపోరుకు తెరలేచింది. అయితే కాలం కలసిరాని కలెక్టర్లకు పోలీస్‌ఆఫీసర్లే గొప్ప అని ఒప్పుకోక తప్పింది కాదు. రాజకీయనాయకుల వల్ల అధికారులని నిలదీసే శక్తి ప్రజల్లో పెరిగింది కాని, భాద్యతయుతంగా ఉండే   ప్రజల్ని పొంపొందించలేకపోయారు. ప్రజల్లో అనార్కిజాన్ని పెంచారు.  రాజకీయనాయకుల జోక్యం అన్నిట్లో పెరిగినట్లే కలెక్టర్‌ ఆఫీసుల్లో కూడా చేరింది. అలాగే జిల్లాల్లో జనాభాపెరిగింది. అవసరాలు పెరిగాయి. వాటితోపాటు సమస్యలూనూ, కలెక్టరు మాత్రమే ఎప్పటిలాగే.


ఎడిషనల్‌గా పెడదామన్న ఇప్పటికే ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా 3000 ఐఎఎస్‌ల షార్టేజీ...కాబట్టి సమస్యలతో నెట్టుకొస్తూ కలెక్టర్లూ రాత్రి పగలూ లేకుండా పనిగంటలు పెంచినా రాజకీయనాయకుల విపరీతమైన జోక్యం. పులిమీదపుట్రలా మంత్రి టిజి వెంకటేశ్‌ రెచ్చిపోయి కలెక్టర్లంతా వెధవలని, పనిచేయకుండా కుర్చీలకు అంటుకుపోతారని, అలాంటి వారిని నడిరోడ్డుమీద కాల్చేయాలనికూడా సెలవిచ్చారు. దాంతో శనివారం కలెక్టర్లంతా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చింది. వాళ్ల స్టయిల్లో వారు ఆగ్రహం వ్యక్తంచేశారనుకొండి. ప్రస్తుతానికి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందాఅని కలెక్టర్లు ఎదురు చూస్తున్నారు. కలెక్టర్లందర్నీ ఒకే గాటను కట్టోందని కూడ వారు హెచ్చరించారు. దీన్నిబట్టి తేలేదేంటంటే ముందు మారాల్సింది రాజకీయనాయకులని, అందులోనూ ప్రజల్ని సుపరిపాలనతో మెప్పించలేక  వాళ్లను రెచ్చగొట్టే టిజి వెంకటేశ్‌ లాంటి నాయకులేనని.

By
en-us Political News

  
భవనం పైకప్పు సమీపంగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో నాలుగో తరగతి చదువుతున్న రెబికా అనే 11 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన నందిని అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
అక్వాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక పోతే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
సాయంత్రాలు ఒకింత సేదదీరుదామని పార్కులకు వెడదామనుకునే మధ్య తరగతి వేతన జీవులు, కష్ట జీవులకు ఇక పార్కులలో ప్రవేశం భారంగా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులలో ప్రవేశ రుసుము ఇక దాదాపు రెట్టింపు కానుంది.
రాష్ట్రంలో ఆన్‌లైన్ ఫార్మసీ వేదికల ద్వారా జరుగుతున్న మందుల విక్రయాలపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్)  దాడులు నిర్వహించారు.  ఔషధ విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను  ఉల్లంఘించినట్లు తేలడంతో, ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం కలిగి ఉన్న మొత్తం 23 మెడికల్ షాపుల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. 
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.