Publish Date:Jul 30, 2026
దేశంలోనే ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలలో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో ఓ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. 36 ఏళ్ల యువ శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. దీపక్ రెడ్డి స్వస్థలం హైదరాబాద్. విద్యా రంగాన్ని, విద్యార్థి లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతుడైన యువ ప్రొఫెసర్, అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. క్యాంపస్‌లోని బి-టైప్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్రొఫెసర్ దీపక్ రెడ్డి గురువారం (జులై 29) మధ్యాహ్నం వరకూ కూడా తన నివాసం నుంచి బయటకు రాకపోవడంతో తోటి సిబ్బందికి, పొరుగువారికి అనుమానం వచ్చింది. తలుపులు బాది, గట్టిగా పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో, క్యాంపస్ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు.
లోపల ప్రొఫెసర్ దీపక్ రెడ్డి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ దీపక్ రెడ్డి మృతి పట్ల ఖరగ్ పూర్ ఐఐటీ యాజమాన్యం తీవ్ర సంతాపం ప్రకటించింది.
IIT Kharagpur, Deepak Reddy Pullaguram, Hyderabad professor death, IIT Kharagpur suicide
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-professor-dies-under-suspicious-circumstances-at-iit-kharagpur-36-227518.html
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్‌ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్‌ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 3న భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, రూ. 20,200 కోట్ల ఎఫ్‌పిఐ పెట్టుబడులు మరియు ఆర్‌బిఐ పాలసీ అప్‌డేట్స్‌తో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వ్యాపారంలో చెల్లించని లేదా బాకీ ఉన్న ఖర్చులను పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చా? రూ. 8 కోట్ల నష్టపరిహార వివాదంలో ఐటీఏటీ ITAT ముంబై ఇచ్చిన సంచలన తీర్పు, పన్ను మినహాయింపు నిబంధనలు మరియు మ్యాచింగ్ ప్రిన్సిపుల్ సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గ్, జూబ్లీహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాల్లో నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న 10 అంతస్తుల ఇందిరమ్మ LIG హౌసింగ్ టవర్లు, 7,680 ఫ్లాట్లు మరియు పూర్తి ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోండి.