బాబోయ్ పెద్ద పులి.. జంగారెడ్డి గూడెం పరిసర గ్రామాల్లో భయం భయం.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.  గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి.. పశువులపై దాడులు చేస్తూ  అటు గ్రామస్థులు, ఇటు అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది.  పులిని బంధించేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోతోంది. 

మహారాష్ట్రలోని వార్ధా నుండి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు సుమారు 30 మందికి పైగా అటవీ సిబ్బంది పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు.  పులి సంచరిస్తున్న మార్గాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లు, ఎరలు సిద్ధం చేశారు.  దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులి ట్రాకింగ్ కు తీవ్ర విఘాతం కలుగుతోంది. పులి సంచారంతో   స్వర్ణవారిగూడెం, లక్ష్మణుడుగూడెం, కొయ్యలగూడెం, పండుగూడెం తదితర  గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

వర్షాకాలం ప్రారంభమై పొలం పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పెద్దపులి భయం వెంటాడటంతో చేలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు  తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.  పులి సంచారం కారణంగా జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రిపూట బయటకు రావద్దనీ,  పశువులను మేత కోసం అడవికి తోలొద్దనీ హెచ్చరించారు.  ప్రమాదకర ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  సాధ్యమైనంత త్వరలో పెద్దపులిని పట్టుకుంటామనీ అంత వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అధికారులకు సహకరించాలని అటవీశాఖ కోరుతోంది. 

Fear grips  villages around Jangareddygudem, Tiger, animals, forest dpartment, 

By
en-us Political News

  
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఏడేళ్లుగా తనకు ఇస్తున్న హామీలను నిర్వాహకులు నెరవేర్చడంలేదన్నారు. చెప్పిన సమయానికి విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. తన ఆగ్రహానికి గురికాకముందే ఇచ్చిన మాటను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నప్పటికీ.. మాట తప్పడం సరికాదన్నారు.
భారత వాతావరణ శాఖ శాస్త్రీయ అధ్యయనాల అనంతరం ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని చెబుతుంటే.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భవిష్యవాణి రంగం మాత్రం కుండపోత వర్షాలు, భారీ వరదల ముప్పు ఉందని హెచ్చరిస్తోంది.
మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
భోగాపురం నుంచి నేరుగా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ఉత్తరాంధ్ర ప్రగతికి గేట్‌వేగా అభివర్ణించారు. ఇప్పుడు ఇక తదుపరి టార్గెట్ గా అమెరికా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపడమే కావాలని ఆంధ్రులు కోరుతున్నారు.
నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ప్రజాస్వామ్య నిరసన హక్కును గౌరవిస్తూ ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ట విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది
బోనం కింద పడటంతో జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించేందుకు వచ్చిన తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలాంటిర్ టెక్నాలజీస్ మరియు అర్మాడా సంయుక్తంగా షిప్పింగ్ కంటైనర్లలో ఎన్విడియా B300 AI యాక్సిలరేటర్లతో పనిచేసే మొబైల్ వార్ డేటా సెంటర్లను ఆవిష్కరించాయి. ఇంటర్నెట్ మరియు క్లౌడ్ కనెక్షన్ లేకపోయినా యుద్ధ రంగంలోనే స్వతంత్రంగా పనిచేసే ఈ వినూత్న టెక్నాలజీ విశేషాలు చూడండి.
సోనీ సంస్థ తన 10 ఏళ్ల మైలురాయిగా విడుదల చేసిన అత్యంత విలాసవంతమైన 1000X కలెక్షన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌పై మొదటిసారి 15 శాతం పరిమిత కాలపు డిస్కౌంట్‌ను ప్రకటించింది. DSEE ఆల్టిమేట్ టెక్నాలజీ, 12 మైక్రోఫోన్ల నోయిస్ క్యాన్సిలేషన్ మరియు 24 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ప్రీమియం ఆడియో డివైజ్ పూర్తి వివరాలు మరియు ఆఫర్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ లిమిటెడ్ ఐపిఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 212 గా నిర్ణయించబడింది. ఆగస్టు 7 నుండి 11 వరకు సబ్‌స్క్రిప్షన్ కి అందుబాటులో ఉండే ఈ ఐపిఓ పూర్తి వివరాలు, లాట్ సైజ్ మరియు లిస్టింగ్ తేదీలను ఇక్కడ తెలుసుకోండి.
8వ వేతన సంఘం 8th Pay Commission వార్షిక ఇంక్రిమెంట్ ప్రతిపాదనలపై కీలక వివరాలు. 3%, 5%, మరియు 6% ఇంక్రిమెంట్‌ల ఆధారంగా లెవెల్ 1, 2, 3 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 5 ఏళ్లలో ఎలా పెరుగుతుందో సమగ్రంగా తెలుసుకోండి.
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.