Publish Date:Jan 20, 2022
'ఓయో' రూమ్స్. ఒకప్పటి లాడ్జిలు.. ఇప్పుడు మోడ్రన్ ఓయో రూమ్స్‌గా మారాయి. చాలామంది యూత్‌కు అదో ఫేవరేట్ ప్లేస్. జస్ట్ ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు.. ఆన్‌లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉండొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చు.. ఆడా-మగా.. రూమ్‌లో ఇష్టం వచ్చినట్టు గడపొచ్చు. అందుకే, బాయ్స్ అండ్ గాళ్స్ ఏకాంతంగా గడపడానికి బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి ఓయో రూమ్స్.
ఆమె ఎవరు? అతను ఎవరు? ఆమె నీకు ఏమవుతుంది? మీ ఇద్దరి రిలేషన్ షిప్ ఏంటి? ఇలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. పోలీసులు అస్సలు అడుగుపెట్టరు. ఏమన్నా అంటే.. సుప్రీంకోర్టు రూల్స్. ఆడా-మగ కలిసి ఒకే రూమ్‌లో ఉండొచ్చు అంటూ రూల్స్ మాట్లాడుతుంది ఓయో సంస్థ. అందుకే, పార్కులు, ఫ్రెండ్స్ రూమ్స్, లాడ్జిలు మానేసి.. కాలేజ్ లవర్స్, ఇల్లీగల్ ఎఫైర్స్ అన్నీ ఇప్పుడు ఓయో రూమ్స్‌కు షిఫ్ట్ అవుతున్నాయి. ఫుల్ సెక్యూరిటీ ఉండటం.. ఎలాంటి పనికి మాలిన ప్రశ్నలు అడగకపోవడమే.. ఆ ఆదరణకు కారణం.
ఓయో రూమ్స్‌లో జరుగుతున్న యవ్వారాలపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి కాబట్టి.. ఎవరూ వారిని టచ్ చేయలేకపోతున్నారు. లాడ్జీలపై రైడ్స్ చేస్తారు.. ఓయో రూమ్స్‌ను ఎందుకు తనిఖీలు చేయారంటూ పోలీసులపై మహిళా సంఘాలు ఎప్పటినుంచో ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ ఓయో రూమ్స్ వ్యవహారంపై స్పందించారు. ఆయన ఏమన్నారంటే....
ఓయో లాడ్జ్‌ల వ్యాపారాలకు తాము వ్యతిరేకం కాదన్నారు. వాటి నిర్వహణ తీరు బాగోలేదన్నారు. ఎవరికి రూం ఇస్తున్నారో, ఎవరు రూంలలో ఉంటున్నారో సరిగ్గా చెక్ చేయట్లేదన్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌లపై నిఘా పెట్టల్సిన అవసరం ఉందన్నారు. ఓయో లాడ్జ్‌లలో సీసీ కెమెరాలు కూడా సరిగ్గా ఉండట్లేదన్నారు. ఓయో రూమ్స్ , లాడ్జ్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-cp-cv-anand-on-oyo-rooms-matter-39-130462.html
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.